విజయవాడ: ఫిబ్రవరి 27 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి రెండో విడత స్పోర్ట్స్ పోటీలు అత్యంత ఘనంగా, విజయవంతంగా ముగిశాయ ని శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ లోని శాప్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడాకారులు మీడియా సమన్వయం తో ఈ కార్యక్రమం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ హయాం తరహాలో క్రీడా సంస్కృతి స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచనల మేరకు, గతంలో ఎన్టీఆర్ హయాంలో జరిగిన క్రీడా పోటీల తరహాలో మళ్లీ ప్రజాప్రతినిధుల్లో క్రీడా సంస్కృతిని తీసుకువచ్చామని రవి నాయుడు వెల్లడించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవులను పక్కన పెట్టి, గాయాలైన ప్పటికీ పట్టుదలతో ఆడియువతకు,తల్లిదండ్రులకు ప్రేరణగా నిలిచారని కొనియాడారు. ఈ పోటీల ద్వారా నియోజ కవర్గ స్థాయిలోనియువ క్రీడాకారుల ప్రతిభను గుర్తించడానికి ఒక మంచి వేదిక ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి కూటమి ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఇందులో భాగంగా విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియం రూపురేఖలను పూర్తిగా మార్చబోతున్నామని రవి నాయుడు తెలిపారు. ఖేలో ఇండియా నుండి మంజూరైన నిధులతో అభివృద్ధి పనులు చేపడతామని, మార్చి 4వ తేదీ నాటికి టెండర్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు అలాగే గుంటూరులో ప్రో కబడ్డీ టోర్నమెంట్లు నిర్వహించే స్థాయికి మౌలిక వసతులతో మల్టీ పర్పస్ ఇండోర్ హాల్‌ను నిర్మిస్తున్నామని వివరించారు. గత ప్రభు త్వంపై విమర్శల,? వైసీపీ పాలన లో క్రీడలకు ప్రాధాన్యత లేకుండా పోయిందని, జగన్ బ్యాట్ పట్టుకుని ఫోటోలు దిగడం తప్ప క్రీడాకారులకు చేసింది ఏమీలేదని రవి నాయుడు విమర్శించారు. జాతీయ స్థాయి క్రీడాకారిణి యార్రాజి జ్యోతికి కూడా గతంలో కనీస గౌరవం దక్కలేదని ఆరోపించారు. ప్రస్తుతం 12 విభాగాల్లో పూర్తి పారదర్శకతతో విజేతలను ఎంపిక చేశామని, దేశంలోనే ఎక్కడాలేని విధంగా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ పోటీలు నిర్వహించామని పేర్కొన్నారు. త్వరలో సినీ హీరోలు వర్సెస్ ఎమ్మెల్యేలు, క్రీడలను ప్రోత్సహించే దిశగా విశాఖపట్నంలో సినీ హీరోలు, ఎమ్మెల్యేల మధ్యత్వర లో ప్రత్యేక మ్యాచ్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రవి నాయుడు ప్రకటించారు. క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదని, అవి ఒక భావోద్వేగం, సంస్కృతి అని ఆయన వ్యాఖ్యానించారు. మార్చి 6న బహుమతుల ప్రధానోత్సవం. ఈ క్రీడా పోటీల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం మార్చి 6వ తేదీన అత్యంత వేడుకగా జరగనుందనీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్య మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు. అని అన్నారు ఈ కార్యాలయంలో శాప్ బోర్డు సభ్యులు సంతోష్ కుమార్, జగదీశ్వరి, రజనీ తదితరులు పాల్గొన్నారు.
