బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు.. సీఎం చంద్రబాబు – డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం

ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు.. సీఎం చంద్రబాబు – డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం

అమరావతి, నేటి తెలుగు పత్రిక: ఏపీలో ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళగిరిలో జరిగిన హనుమాన్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం అనంతరం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఇద్దరు నేతలు సుమారు రెండు గంటలపాటు సమావేశమై పలు ముఖ్య అంశాలపై చర్చించారు.సమావేశంలో ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ అమలు పురోగతిపై దృష్టి సారించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించే లక్ష్యంతో నిలిచిపోయిన తాగునీటి ప్రాజెక్టులను తక్షణమే పునరుద్ధరించి పనులు వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వ్యక్తికి రోజుకు కనీసం 55 లీటర్ల తాగునీరు అందించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక గత ప్రభుత్వ కాలంలో కేంద్రం అందించిన జల్ జీవన్ మిషన్ నిధులు సరైన విధంగా వినియోగం కాలేదని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ప్రస్తుతం నిలిచిపోయిన పథకాలను తిరిగి ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సరఫరాను బలోపేతం చేయాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్, అటవీ శాఖలకు సంబంధించిన పలు అంశాలపై కూడా చర్చ జరిగింది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో రోడ్ల అభివృద్ధి, నిధుల కేటాయింపు, జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి వంటి అంశాలపై అధికారులు నివేదికలు సమర్పించినట్లు సమాచారం.అదే సమయంలో రాష్ట్రంలోని పంచాయతీల్లో చేపట్టిన “మ్యాజిక్ డ్రెయిన్స్” పనుల గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీఎంకు వివరించారు. ఈ డ్రెయినేజీ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడుతుందని ఆయన తెలిపారు. అలాగే నీటిపారుదల శాఖ పరిధిలోని డ్రైనేజీలలో పూడికతీత పనులను వేసవిలోనే పూర్తి చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్ట్ వివరాలను కూడా పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుకు వివరించారు. రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్