బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఉండవల్లి నివాసంలో లోకేష్ డిన్నర్ మీట్.. ప్రజాప్రతినిధులు, కుటుంబాలతో సందడి

ఉండవల్లి నివాసంలో లోకేష్ డిన్నర్ మీట్.. ప్రజాప్రతినిధులు, కుటుంబాలతో సందడి

ఉండవల్లి,నేటి తెలుగు పత్రిక: ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన డిన్నర్ మీట్ ఆత్మీయ వాతావరణంలో జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు మరియు తిరుపతి పార్లమెంట్ పరిధికి చెందిన ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులు ఈ విందుకు హాజరయ్యారు. ఫ్యామిలీ పార్టీలాగా సాగిన ఈ సమావేశంలో అందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు.డిన్నర్ మీట్‌కు వచ్చిన ప్రతి కుటుంబాన్ని లోకేష్ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ పేరుపేరునా పలకరించారు. అతిథులు అందించిన దేవుని ప్రతిమలను చెప్పులు తీసి భక్తితో స్వీకరించారు. చిన్నపిల్లలతో సరదాగా మాట్లాడి, వారు ఏం చదువుతున్నారని అడిగి కొంతసేపు ఆటలాడారు.ఈ కార్యక్రమానికి హాజరైన మహిళామూర్తులకు మంగళగిరి పట్టుచీరలు అందజేసి లోకేష్ గౌరవించారు. ప్రజాప్రతినిధులు ఇచ్చిన వినతిపత్రాలపై తీసుకున్న చర్యలు, ఇంకా పరిష్కారం కావాల్సిన అంశాలపై వివరాలతో నివేదికను కూడా వారికి అందించారు.ఈ ఆత్మీయ సమావేశానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు, అలాగే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్