బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఏపీకి భారీ పెట్టుబడులు.. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు

ఏపీకి భారీ పెట్టుబడులు.. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు

అమరావతి, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రాన్ని సాంకేతికత, పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఐదేళ్లలో 20 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన ఆయన విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌తో పాటు టీసీఎస్‌, ఆర్సెల్లార్ మిట్టల్‌, ఎన్‌టీపీసీ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించారు.

పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చామని, ఈ రంగంలో రూ.18 వేల కోట్ల పెట్టుబడులతో 3.4 లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నట్లు తెలిపారు. ఆరోగ్య రంగంలో యూనివర్సల్ వైద్య విధానం అమలు చేసి ప్రతి ఒక్కరికీ రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్యం, రూ.20 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.అలాగే గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ దానిపై లోతైన దర్యాప్తు జరిపిస్తామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, ఏపీని ప్రపంచస్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్