Breaking News

రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధిపై పెట్టుబడులు: మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

అమరావతి,05.03.26,నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. మండలిలో ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, బీటీ నాయుడు, బీద రవిచంద్ర అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.రాష్ట్రంలోని ఏకైక మేజర్ పోర్టు విశాఖ పోర్టు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 141.6 MMTPA సామర్థ్యంతో పనిచేస్తోందన్నారు. గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ డీప్ వాటర్ పోర్టులు పీపీపీ మోడల్‌లో మారిటైమ్ బోర్డు నియంత్రణలో నడుస్తున్నాయని చెప్పారు. గంగవరం పోర్టు 64 MMTPA, కృష్ణపట్నం పోర్టు 98 MMTPA, కాకినాడ డీప్ వాటర్ పోర్టు 26 MMTPA సామర్థ్యంతో పనిచేస్తున్నాయని వివరించారు.అలాగే రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు EPC విధానంలో నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. వీటిలో రామాయపట్నం పోర్టు 2026 ఏప్రిల్ 24 నాటికి, మచిలీపట్నం పోర్టు 2026 డిసెంబర్ 28 నాటికి, మూలపేట పోర్టు 2026 నవంబర్ 30 నాటికి పూర్తవుతాయని వెల్లడించారు.తూర్పు గోదావరి జిల్లా కోన గ్రామంలో పీపీపీ మోడల్‌లో కమర్షియల్ పోర్టు అభివృద్ధి జరుగుతోందని, అది 2026 జూలై నాటికి పూర్తవుతుందని మంత్రి చెప్పారు. ఈ పోర్టులు పూర్తైన తర్వాత 6 నుంచి 9 నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందన్నారు.పోర్టులకు అవసరమైన రైలు, రోడ్డు అనుసంధానానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.

కృష్ణాజిల్లా డిపిఓ కార్యాలయాన్ని అసత్య ఆరోపణలతో అల్లరి చేస్తున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు డిమాండ్.

మహిళా రిజర్వేషన్‌పై చంద్రబాబు విమర్శలు.. ఇండి కూటమిపై ఆగ్రహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *