బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

రామ మందిరంతో అయోధ్య ఆర్థికంగా దూసుకుపోతోంది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

రామ మందిరంతో అయోధ్య ఆర్థికంగా దూసుకుపోతోంది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

నేటి తెలుగు పత్రిక: జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ రామమందిరం అయోధ్య నిర్మాణంతో అయోధ్య ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిందని పేర్కొన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లక్నో రూపొందించిన నివేదిక ప్రకారం రామ మందిరం నిర్మాణం తర్వాత అయోధ్యలో వ్యాపారుల ఆదాయం ఐదు రెట్లు పెరిగిందని తెలిపారుఆరు నెలల్లోనే సుమారు 11 కోట్ల మంది భక్తులు రామ మందిరాన్ని సందర్శించారని, దీంతో నగరంలో 1.2 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయని చెప్పారు. అలాగే అయోధ్యలో సుమారు రూ.10,000 కోట్ల పెట్టుబడులు, ఆదాయం వచ్చాయని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా అనేక ఆధ్యాత్మిక కేంద్రాలు తీర్థయాత్రల ద్వారా అభివృద్ధికి దారితీసినట్లు పేర్కొంటూ, ప్రధాని నరేంద్ర మోదీనాయకత్వంలో అయోధ్య తన ప్రాచీన ఆధ్యాత్మిక వైభవాన్ని తిరిగి పొందడంతో పాటు ఆర్థికంగా కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.అలాగే కాశీ విశ్వనాథ్ కారిడార్, మహాకాల్ లోక్ వంటి ప్రాజెక్టులు కూడా ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి దోహదపడ్డాయని ఆయన తెలిపారు. “వికాస్ భీ.. విరాసత్ భీ” అనే భావనతో భారత్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ