బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

భట్టి కుమారుడి పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణ.. పాదయాత్రలో పాల్గొన్న మహిళలకు సత్కారం

భట్టి కుమారుడి పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణ.. పాదయాత్రలో పాల్గొన్న మహిళలకు సత్కారం

నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య – సాక్షిల వివాహ వేడుకలో హృద్యమైన ఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకలో రాజకీయ ప్రముఖులతో పాటు భట్టి విక్రమార్కతో గతంలో పాదయాత్రలో పాల్గొన్న ఆదివాసీ మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.గత ఎన్నికల ముందు సీఎల్పీ నేతగా ఉన్న సమయంలో ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నుంచి ఖమ్మం వరకు భట్టి విక్రమార్క నిర్వహించిన పాదయాత్రలో పలువురు ఆదివాసీ మహిళలు ఆయనకు అండగా నిలిచారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైనూర్, ఉట్నూర్ మండలాలకు చెందిన లక్ష్మీబాయి, రుక్మబాయి, గంగుబాయి, సుమన్‌బాయి తదితరులు పాదయాత్ర అంతా పాల్గొని తమ సంప్రదాయ పానీయాలతో ఆయనకు సహాయం చేశారు.

ఈ అనుబంధాన్ని మరవని భట్టి విక్రమార్క దంపతులు, తన కుమారుడి వివాహానికి వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. వేడుకకు వచ్చిన ఆ మహిళలను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అంతేకాదు, వారికి వివాహ వేదికపైనే ప్రత్యేక స్థానం కల్పించి గౌరవించడం అందరినీ ఆకట్టుకుంది.పదవులు వచ్చినా పాత అనుబంధాలను మరువని భట్టి విక్రమార్క కృతజ్ఞత, మానవ సంబంధాల పట్ల గౌరవాన్ని ఈ ఘటన మరోసారి చాటిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి