బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

విజయ్–రష్మిక ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి.. కొత్త జంటను ఆశీర్వదించిన సీఎం.. వైరల్ అవుతున్న ఫోటోలు

విజయ్–రష్మిక ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి.. కొత్త జంటను ఆశీర్వదించిన సీఎం.. వైరల్ అవుతున్న ఫోటోలు

నేటి తెలుగు పత్రిక: టాలీవుడ్ ప్రేమ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.అయితే ఆ రోజు ఢిల్లీ పర్యటనలో ఉండటం వల్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిసెప్షన్‌కు హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం స్వయంగా విజయ్ ఇంటికి వెళ్లి నూతన వధూవరులను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. కొత్త జంటకు ఆశీర్వాదాలు అందించి ప్రత్యేకంగా అభినందించారు.ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. “గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం మా హృదయాన్ని కదిలించింది. ఆయన ఎల్లప్పుడూ పంచే ప్రేమ, ఆప్యాయతకు కృతజ్ఞతలు” అంటూ పోస్ట్ చేశారు.అలాగే సీఎం రేవంత్ రెడ్డి, రోహిన్ రెడ్డి సహా పలువురు నేతలతో కలిసి దిగిన ఫోటోలను విజయ్ షేర్ చేయగా, ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి