ఖమ్మం,నేటి తెలుగు పత్రిక: భూదాన్ యజ్ఞ బోర్డు వెలుగుమట్ల సర్వేనెంబర్ 147 148 149 లలో గత 2013 సంవత్సరం నుండి నిరుపేదలు కష్టజీవులు సుమారు 750 మంది ఇల్లులు వేసుకొని జీవిస్తున్నారు ప్రభుత్వం వారికి పట్టాలి ఇచ్చి పక్కా గృహాలు నిర్మించాల్సింది పోయి అద్దాంతరంగా అత్యంత దారుణంగా ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గపు చర్య ఈ చర్యని అన్ని వర్గాల ప్రజలు అన్ని నిరసించాలని కోరుతున్నాం. ఈ భూదాను భూములు కలవల రాజారాం అనే వ్యక్తి 1951 లో 62 ఎకరాలు తన సొంత భూమిని భూదాన్ బోర్డుకి ఇచ్చారు. భూదాన్ అంటేనే ఇల్లు లేని పేదలకు నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇచ్చే అంశం కానీ కార్యక్రమం లో 31 ఎకరాలు కొంతమంది రియల్ ఎస్టేట్ కోసం ఆక్రమణ చేసుకున్నారు వారిపై ఎలాంటి చర్యలు లేవు ఆ 31 ఎకరాల లెక్కలు లేవు మిగిలిన 31 ఎకరాల భూదాన భూమిలో 2013 నుంచి నిరుపేదలు చిన్న చిన్న గుడిసెలు రేకుల ఇల్లు మట్టి ఇల్లులు కొన్ని పక్కా గృహాలు నిర్మించుకొని గత 14 సంవత్సరాల నుండి ఉంటున్నారు వారికి మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం వారికి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ కింద ఐదు లక్షలు సహకరించాల్సింది పోయి 2500 మంది పోలీసులు వందలాదిమంది రెవెన్యూ ఉద్యోగస్తులను తీసుకువచ్చి తెల్లార్దమున 5 గంటల నుండి కూల్చివేతలు ప్రారంభించి తమ నిర్బంధంలో ఆ ప్రాంతాన్ని ఉంచుకొని ఎవరిని అక్కడికి రానివ్వకుండా ఆజ్ఞలు విధించి వచ్చిన ప్రజాసంఘాల నాయకులను. వామపక్ష నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఇంత అమానుషమైన చర్య ఇంతవరకు జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆరు గ్యారెంటీలలో నిరుపేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని ఉన్నది కానీ ఆ వాగ్దానం అమలు పక్కనపెట్టి ఖమ్మం వెలుగుమట్ల ఇళ్లను కూల్చివేయడం తప్పుడు చర్య తప్పుడు సమాచారంతో యంత్రాంగం మొత్తం ఈ కూల్చివేత చర్యలకు పాల్పడ్డది దీనిపై ఇప్పటికే అనేక ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు పేదల పక్షాన నిలబడి పోరాడుతున్నాయి మన ప్రజా సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ఐక్యంగా వెలుగుమట్ల భూదాన్ భూములలో నిర్మించుకున్న ప్రజలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారి పక్షాన ఉంటూ అదే అదే భూదాన్ భూములలో సమగ్రంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఈ ప్రభుత్వం ఇవ్వాలని మౌలిక వసతులు కల్పించాలని ఇల్లు కూల్చివేతతో సర్వం కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని నిరాశ్యులైన వారందరికీ తక్షణం లక్ష రూపాయలు ఇవ్వాలని వివిధ క్యాంపులలో ఉన్న ప్రజలకు ఆహారం వైద్య సౌకర్యాలు మంచినీటి సౌకర్యాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి ఈ ప్రభుత్వ వైఖరి నిర్మిస్తూ వారి హక్కుల సాధన కోసం భవిష్యత్ కాలంలో దశల వారి పోరాటాలు నిర్వహించేందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం దోహదపడాలని ఆ విధంగా వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు భాగస్వాములు కావాలని భూదాన్ భూముల్లో ఇల్లు నిర్మించుకొని ఉన్న ప్రజలందరికీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారి హక్కు సాధన కోసం కృషి కృషి చేయాలని కోరుతున్నాం.
ఇట్లు
వ్యవసాయ కార్మిక సంఘలు. ప్రజా సంఘాలు ఖమ్మం జిల్లా కమిటీలు.


