Breaking News

నెల్లూరు రైల్వే స్టేషన్‌లో జనసేన నేత బుల్లెట్ ధర్మారావుకు ఘన సత్కారం

నెల్లూరు , నేటి తెలుగు పత్రిక: నెల్లూరు జిల్లా రాధా రంగా మిత్రమండలి గౌరవాధ్యక్షులు. పప్పు లక్ష్మీనారాయణ రావు గారు. కుల,మతాలకు అతీతంగా శ్రీ వంగవీటి మోహన రంగా గారి వీరాభిమానుల ఆధ్వర్యంలో రాధా రంగా మిత్రమండలి రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు & జనసేన పార్టీ నాయకులు బుల్లెట్ ధర్మారావు గారిని నెల్లూరు రైల్వే స్టేషన్ నందు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి పండ్లు బహూకరించినారు. ఈ సందర్భంగా లక్ష్మినారాయణ రావు గారు, కలపాటి మోహన రావు గార్లు మాట్లాడుతూ బుల్లెట్ ధర్మారావు గారు ఎంతో కాలం నుండి మాకు తెలుసని ఆయన సొంత ఖర్చులతో రంగా గారి విగ్రహాలు ఇవ్వటమే కాక,.రాష్ట్రంలో అందర్నీ కలుపుకుని కమిటీలను ఏర్పాటు చేసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడటం గొప్ప విషయం అని.. అంతేకాక పోలాండ్, అమెరికాలో కూడా రంగా గారి జయంతి కార్యక్రమాలు నిర్వహించినారని అక్కడకు వచ్చిన వారు బుల్లెట్ ధర్మారావు గారిని అభినందించినారు. ఎంతో ఆనందంతో బుల్లెట్ ధర్మారావు తనను కలిసిన వారికి పేరుపేరునా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రంగా గారి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు.. పప్పు సాయికృష్ణ,.పేరంశెట్టి రాజేష్, పప్పు మురళీకృష్ణ, సింగంశెట్టి మురళీ, సయ్యద్ షాజహాన్, పప్పు సాయిచందు, గుండు సుబ్రహ్మణ్యం, పటాన్ భాష, పోతరాజు వేణు, నున్నా శ్రీనివాస నాయుడు, షేక్ జంషీద్, కొండా వెంకట్, పేరంశెట్టి హరిబాబు, వెంకటరమణ,.షేక్ మున్నా,. వారి మిత్రబృందం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *