బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

హైదరాబాద్‌కు భారీ ఊరట.. ఎయిర్‌పోర్ట్ దారిలో 6 లైన్ల కొత్త ఫ్లైఓవర్

హైదరాబాద్‌కు భారీ ఊరట.. ఎయిర్‌పోర్ట్ దారిలో 6 లైన్ల కొత్త ఫ్లైఓవర్

హైదరాబాద్‌, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరం నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్‌కు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా ఆరు లైన్ల భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి సిద్ధమవుతోంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ఇప్పటికే సిద్ధమైంది. దాదాపు రూ.345 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్ నిర్మించనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మైలార్ దేవ్‌పల్లి – కాటేదాన్ జంక్షన్ – శంషాబాద్ ప్రాంతాల మీదుగా ఈ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇరువైపులా రాకపోకలు సాగేందుకు బైడైరెక్షన్‌గా ఆరు లైన్లతో దీనిని రూపొందించనున్నారు.ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ద్వారా నగరం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది. అలాగే నేషనల్ హైవే ఉపయోగించే వాహనదారులకు కూడా ఇది ఉపయోగపడనుంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం రెండో దశలో మెట్రో విస్తరణను కూడా ప్రణాళికలో పెట్టింది. ఈ విస్తరణలో భాగంగా నగరం నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో లైన్ నిర్మించే ప్రతిపాదన ఉంది. మెట్రోతో పాటు కొత్త ఫ్లైఓవర్ రావడం వల్ల భవిష్యత్తులో ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది.అదేవిధంగా నగరంలోని పలు ప్రాంతాల్లో కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీటి వల్ల హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గే అవకాశముందని చెబుతున్నారు.