బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

కాపుల అభివృద్ధి చంద్రబాబుతోనే రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

కాపుల అభివృద్ధి చంద్రబాబుతోనే రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి,మార్చి 6(నేటి తెలుగు పత్రిక) : కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనని, ఆయన హయాంలోనే కాపులకు మేలు కలిగేలా పథకాలు అమలవుతున్నాయని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత స్పష్టం చేశారు. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె స్పందిస్తూ, కాపుల సంక్షేమానికి ఏటా బడ్జెట్ లో అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. 2014-19 మధ్య విదేశీ విద్య కింద 1585 మంది కాపు విద్యార్థులకు విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించామన్నారు. ఆ 5 ఏళ్లలో రూ.153.11 కోట్లు కేటాయించామని, గత వైసీపీ ప్రభుత్వం కేవలం 81 మంది కాపు విద్యార్థులకు మాత్రమే విదేశీ విద్యా పథకం వర్తింప జేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత 331 మంది కాపు విద్యార్థులకు విదేశీ విద్యా పథకం బకాయిలు అందజేశామన్నారు. 2024-25లో కాపు సంక్షేమానికి రూ.4,440.25 కోట్లు ఖర్చు చేశామని, 2025-26లో కాపులకు రూ.5,571.48 కోట్లు కేటాయించామని తెలిపారు. 2014-19లో సీఎం చంద్రబాబు… కాపు భవనాల నిర్మాణాలకు నిధులిచ్చారని, తరవాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాపు భవనాల నిర్మాణాలను పున:ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వం కాపుల కోసం ఏడాదికి రూ.3,580 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. కాపుల అభివృద్ధికి కూటమి కృషి కాపుల అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని మంత్రి సవిత తెలిపారు. రూ.38.63 కోట్లతో ఆటో డ్రైవర్ల సేవా పథకం అమలు చేశామని, ఈ పథకం కింద 25,756 మంది కాపు లబ్ధిదారులకు ప్రయోజనం కలిగిందని తెలిపారు. సముద్రంలో చేపల వేట నిషేధం భృతి పథకం కింద రూ.1.02 కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఈ పథకం ద్వారా 511 మంది కాపులకు లబ్ధి కలిగిందన్నారు. మెగా డీఎస్సీ ఆన్ లైన్ కోచింగ్ ప్రోగ్రాం ద్వారా 639 మంది కాపు అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందివ్వగా, 54 కాపు అభ్యర్థులు టీచర్ ఉద్యోగాలు సాధించారన్నారు. కాపు నిరుద్యోగ యువతకు 50 శాతం సబ్సిడీపై రాయితీ రుణాలు అందించడానికి 2025-26 బడ్జెట్ లో రూ.217.79 కోట్ల కేటాయించామన్నారు. చంద్రన్న స్వయం ఉపాధి పథకం కింద 10,300 మంది కాపు లబ్ధిదారులను, గ్రూప్ ఎంఎస్ఎంఈ పథకం ద్వారా 130 గ్రూపులను గుర్తించామని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి పథకం కింద 11,016 మంది కాపు మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ అందజేశామని మంత్రి సవిత తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్