Breaking News

ఆత్మ నిర్భర్ వికసిత్ భారత్‌పై సంకల్పం తీసుకుంటూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి, 06.03.2026, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు “ఆత్మనిర్భర్ వికసిత్ భారత్” సంకల్పానికి అనుగుణంగా ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రాన్ని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో మరింత బలోపేతం చేస్తూ 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన “వికసిత్ భారత్–2047” లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టాలని ప్రభుత్వం సంకల్పం వ్యక్తం చేసింది. 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో భాగంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రూ.308 లక్షల కోట్ల స్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

స్థానిక పరిశ్రమల అభివృద్ధి, తలసరి ఆదాయం పెంపు, ప్రతి ఏడాది సుమారు 15 శాతం స్థిరమైన వృద్ధి రేటు సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా “వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర–2047 సంకల్ప ప్రతిజ్ఞ”ను సభ మద్దతుతో ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు.

రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే సీఎం చంద్రబాబు లక్ష్యం : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)

ఇందులో భాగంగా “వోకల్ ఫర్ లోకల్” మరియు “లోకల్ టు గ్లోబల్” అనే రెండు దశల్లో రాష్ట్రాన్ని తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని, రెండో దశలో ప్రపంచ స్థాయి నాణ్యతతో తయారైన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ చేసే స్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.అదేవిధంగా ఎంఎస్ఎంఈలు, చేతివృత్తిదారులు, శిల్పకారులు, రైతులు, చేనేత కార్మికులు, యువ పారిశ్రామికవేత్తలకు పూర్తి మద్దతు అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలు మరియు పుణ్యక్షేత్రాలను సందర్శించేలా ప్రజలను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ఆర్థిక స్వావలంబన, సాంస్కృతిక గౌరవాన్ని కాపాడాలని తీర్మానంలో పేర్కొన్నారు.రాష్ట్రాభివృద్ధి ద్వారా దేశాభివృద్ధి సాధ్యమని, అందుకోసం సభ్యులందరూ కలిసి సామూహిక సంకల్పాన్ని ప్రకటించడం ఒక చారిత్రాత్మక అడుగుగా సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు.

దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *