బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

ఎప్పటి నుంచో ఉన్న కోరిక తీరింది.. ‘వృషకర్మ’పై నాగ చైతన్య ఎమోషనల్ కామెంట్స్

ఎప్పటి నుంచో ఉన్న కోరిక తీరింది.. ‘వృషకర్మ’పై నాగ చైతన్య ఎమోషనల్ కామెంట్స్

Mar 06, 2026, నేటి తెలుగు పత్రిక: యువ సామ్రాట్ నాగ చైతన్య తన కొత్త చిత్రం *‘వృషకర్మ’*పై భారీ అంచనాలు వ్యక్తం చేశారు. ‘విరూపాక్ష’ ఫేమ్ దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మిథికల్ థ్రిల్లర్ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇటీవల విడుదలైన ‘వృషకర్మ’ గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేపింది. భయానకమైన సన్నివేశాలతో ప్రారంభమైన ఈ గ్లింప్స్‌లో అతీంద్రియ శక్తులు, దుష్ట శక్తుల నేపథ్యంలో కథ సాగనున్నట్లు చూపించారు. ఒక దుష్ట శక్తి గబ్బిలం రూపంలో బయటకు వచ్చి మరో వ్యక్తి తలలోకి వెళ్లే సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన నాగ చైతన్య మాట్లాడుతూ.. ఈ సినిమా తన కెరీర్‌లో 100 శాతం బెస్ట్ మూవీ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. చాలా కాలంగా పెద్ద స్కేల్‌లో మిథికల్ థ్రిల్లర్ చేయాలనే కోరిక ఉండేదని, అది ‘వృషకర్మ’తో తీరిందని తెలిపారు. ముఖ్యంగా సినిమా చివరి 30 నిమిషాల క్లైమాక్స్ ఇండియన్ సినిమాలోనే ఒక బెంచ్‌మార్క్‌గా నిలుస్తుందని చెప్పారు.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?

ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, జయరామ్, సత్య అక్కల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని అజనీష్ లోక్‌నాథ్ అందిస్తుండగా, విజువల్ ఎఫెక్ట్స్ మరియు ప్రొడక్షన్ డిజైన్ కూడా సినిమాకు భారీ స్థాయిలో ఉండనున్నాయని చిత్రబృందం చెబుతోంది.