బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

హామీలు నెరవేర్చాలి.. మున్నూరు కాపు కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలి: డా. కొండ దేవయ్య పటేల్

హామీలు నెరవేర్చాలి.. మున్నూరు కాపు కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలి: డా. కొండ దేవయ్య పటేల్

మార్చి 06,(నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా. కొండ దేవయ్య పటేల్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ఏర్పాటైన తర్వాత గత ప్రభుత్వాలు మున్నూరు కాపుల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర జనాభాలో సుమారు 12 శాతం, బీసీ జనాభాలో 18 శాతం ఉన్న మున్నూరు కాపులకు ఇప్పటివరకు సరైన ప్రాతినిధ్యం, అభివృద్ధి నిధులు అందలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో మున్నూరు కాపు సంఘాల నాయకులకు కార్పొరేషన్ ఏర్పాటు, ప్రతి జిల్లా కేంద్రంలో బాలబాలికల హాస్టల్ నిర్మాణానికి రెండు ఎకరాల భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఇప్పటివరకు ఆ హామీలు అమలుకాలేదని విమర్శించారు.మూడు సంవత్సరాల రాష్ట్ర బడ్జెట్ సుమారు ₹9 లక్షల కోట్ల వరకు ఉన్నప్పటికీ మున్నూరు కాపుల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదని అన్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్‌కు ప్రతి సంవత్సరం కనీసం ₹1000 కోట్లు చొప్పున మూడు సంవత్సరాలకు ₹3000 కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు విద్యార్థుల కోసం హాస్టల్ భవనాల నిర్మాణానికి భూమి, నిధులు కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మున్నూరు కాపు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి హామీల అమలు కోసం చర్యలు తీసుకోవాలని డా. కొండ దేవయ్య పటేల్ విజ్ఞప్తి చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి