Breaking News

ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

విజయవాడ. మార్చి 6 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ప్రజాదర్బారులోని ప్రజల సమస్యలను ప్రభుత్వానికి నివేదించి తప్పకుండా పరిష్కారం చేస్తామని, ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, యువనేత గద్దె క్రాంతి చెప్పారు. ఈ సందర్భంగా పటమట అశోక్‌ నగర్‌ లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారంనాడు ప్రజాదర్భార్‌ కార్యాక్రమం జరిగింది. ఎన్టీఆర్‌ జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ హజరై ప్రజల నుంచి సమస్యలపై వినతి పత్రాలను తీసుకున్నారు. ప్రజాదర్బార్ కార్యక్రమం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగింది. అనంతరం గద్దె అనురాధ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దె అనూరాధ మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకో కుండా, ప్రజలను అనేక రకాలుగా మోసం చేసిందని విమర్శించారు. పేద ప్రజలకు ఇవ్వని ఇళ్లకు రుణాలు తీసుకొనివాడు కొందని, కొందరికి భూముల పట్టాలిచ్చి స్థలాలు చూపలేదని, మరికొందరికి లోతట్టు ప్రాంతాల్లో వర్షాలకు మునిగిపోయే స్థలాలను కేటాయించిందని, ఇంకా కొందరికి అమరావతిలో ఇతర సిటీల నిర్మా ణానికి కేటాయించిన భూములను ప్లాటులుగా ఇచ్చిందని దుయ్యబట్టారు. ఆ లబ్ధిదారులంతా ఇప్పుడు తమ గోడు వినిపిస్తూ ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. వీటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ ఛిన్నా భిన్నం చేసిందని, వాటినిసరి చేయడానికి కూటమి ప్రభుత్వానికి సమయం వెచ్చిస్తూ అటు అభివృద్ధి, సంక్షేమం చేస్తోందని చెప్పారు. కూటమి ప్రభు త్వం సూపర్‌ సిక్స్‌ పథకాలను సూపర్‌ హిట్‌గా అమలు చేస్తోందని కొనయాడారు. ఇంకా సమస్య లుంటే, వాటిని ప్రజాదాద్బార్లో నివేదిస్తే తాము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపుతమని గద్దె అనురాధ తెలిపారు. కనక ప్రజార్బార్ ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆ విధంగా నాయకులంతా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్‌ ముమ్మనేని ప్రసాద్, దయాల శిరీషా గాంధీ, బచ్చలకూరి అజయ్‌కు మార్, పడమటి సతీష్ చంద్ర, శింగంశెట్టి రమేష్, గళ్లా శ్రీను, పడాల గంగా ధర్, కర్ణా రమేష్, కొక్కెర తిరుపతయ్య, మల్లెల రామకృష్ణ, రేపాకుల శ్రీనివాస్, షేక్ షకీల, హనీఫ్, కర్ణా కోటేశ్వరరావు, ప్రభుత్వ విభాగాల అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే సీఎం చంద్రబాబు లక్ష్యం : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)

దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *