Breaking News

ముగ్గురు బిడ్డలను పుట్టించాలని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై చింతామోహన్ కౌంటర్.

మార్చి 6 (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పేదొకటి, చేసేదొకటి. ఆయన మాటలకు చేతలకు పొంతన ఉండదని, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ పేర్కొన్నారు. జనాభా పెంచేందుకు అసెంబ్లీలో ప్రతి ఒక్కరూ ముగ్గురు బిడ్డల్ని పుట్టించాలని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై చింతామోహన్ స్పందించారు. తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు తెలివిగా ఒకే బిడ్డను కన్నాడు. (లోకేష్) పోనీ ఆయన కొడుకు లోకేష్ ఏమైనా ముగ్గురు బిడ్డలను పుట్టించారా అంటే లేదు. అతను కూడా ఒక కొడుకునే కన్నాడు. మీ ఇంట్లో ముగ్గురు బిడ్డల్ని పుట్టించి, ప్రజలకు చెప్తే ఆమోదయోగ్యంగా ఉంటుందని, ప్రజలందరూ ఆచరిస్తారని తెలిపారు. జనాభా పెరుగుదల గురించి అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగానూ, హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.దుగరాజ పట్టణ ఓడరేవుకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు రావాలి. మేజర్ పోర్టు, ప్రభుత్వ పోర్టు వస్తే, లక్ష రూపాయలు జీతాలు ఇచ్చే ఉద్యోగాలు వస్తాయన్నారు. కూటమి ప్రభుత్వం నౌకాశ్రయం నిర్మాణం పేరుతో, రెండు వేల ఎకరాలు పేదల భూములు లాక్కుందన్నారు. 100 ఎకరాలు నౌకాశ్రయం నిర్మాణానికి సరిపోతుందన్నారు. ఎవరి ప్రయోజనాలను కాపాడడం కోసం రెండు వేల ఎకరాలు పేదల భూములు గుంజుకున్నారని నిలదీశారు.

చంద్రబాబు నాయుడు నేను నిజాయితీపరుడు, నాకు బంధుప్రీతి లేదు అంటాడు. ఎన్టీఆర్ మనవడికి సిలికాన్ ఇచ్చారు. నీ బంధుప్రీతి కాదా? ఎన్టీఆర్ మనవడు నిరుపేదనా? నిరుద్యోగా? అని ప్రశ్నించారు. సిలికాన్ లో సిండికేట్ పేర్లు చెప్పే దమ్ము చంద్రబాబు నాయుడుకు ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. సిలికాన్ లో ప్రతినెలా 14 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకుంటున్నారని చింతామోహన్ ఆరోపించారు.

రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే సీఎం చంద్రబాబు లక్ష్యం : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)

ఎస్సీలు, ఓబీసీలు, ఎస్టీలకు సిలికాన్, మరియు ఇసుకలో కోట ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయుడుపేటలో అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఇసుకను తోలుకుంటున్నారని, డబ్బు సంపాదిస్తున్నారని, నిరుద్యోగులైన, ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఇసుక, సిలికాన్ లో వాటా ఇవ్వాలని స్పష్టం చేశారు. 15 రోజుల్లో దీనిపై స్పష్టత రాకుంటే, మా వాళ్లే వచ్చి ఇసుక, సిలికాన్ తోలుకుంటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేసులకు భయపడబోమని స్పష్టం చేశారు.ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గాడి వెంకటయ్య, చందనమూడి శివ, సుధాకర్, చిన్నం క్రిష్ణయ్య, శంకర రాజు, బాబా తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *