Breaking News

శ్రీ మారెమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా ఎంపీ కేశినేని శివనాథ్

విస్సన్నపేట మార్చి 6 (నేటి తెలుగు పత్రిక): విస్సన్నపేట మండలంపుట్రేల గ్రామంలోని శ్రీ మారెమ్మ అమ్మవారి ఆలయఅభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామంలో శ్రీ మారెమ్మ అమ్మవారిని శుక్రవారం ఆయన దర్శించుకున్నారు.అమ్మవారి దర్శనంకు వచ్చిన ఎంపీ శివనాథ్ కు ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ తేర్ల శ్రీనివాసరావు , ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు మంత్రోచ్ఛరణలతో స్వాగతం పలుకగా అమ్మవారికి పట్టు వస్త్రాలను ఎంపీ శివనాథ్ సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ సమస్యలను ఎంపీ దృష్టికి ట్రస్టు బోర్డు సభ్యులు తీసుకువచ్చారు.అనంతరం మీడియాతో ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ…ఎప్పటినుంచో శ్రీ మారెమ్మ అమ్మవారి దర్శనంకు రావాలని అనుకుంటున్నానని, ఇప్పటికి అమ్మవారి దర్శన భాగ్యం లభించిందన్నారు. ఆంధ్రా ప్రాంతం నుంచే కాకుండా తెలంగాణా రాష్ట్రం నుంచి సైతం అమ్మవారి దర్శనంకు భక్తులు వస్తుంటారని, భక్తుల అవసరాలుకు తగ్గట్టుగా ఆలయం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు తన దృష్టికి ఆలయ డ్రైనేజీ సమస్య ఇతర పలు సమస్యలను తీసుకువచ్చారని, ఆయా సమస్యల పరిష్కారంకు అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకుంటానని ఎంపీ శివనాథ్ అన్నారు.అమ్మవారి దర్శనంకు వచ్చిన తనకు ఎంతో అప్యాయత, అభిమానంతో ఘన స్వాగతం పలికిన ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులకు, గ్రామ పెద్దలకు, ఆలయ అధికారులకు ఈ సందర్భంగా ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆంధ్రప్రదేశ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఆధారిటి చైర్మన్ శావల దేవాదత్, ఎన్టీఆర్ జిల్లా తెలుగురైతు అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు , జిల్లా సీనియ‌ర్ నాయకులు తాళ్లూరి రామారావు , ఎన్టీఆర్ జిల్లా టిడిపి మాజీ ఉపాధ్య‌క్షుడు నెక్క‌ల‌పు శ్రీను (డాబా శ్రీను), విస్స‌న్న పేట మండ‌ల పార్టీ అధ్యక్షుడు రాయ‌ల సుబ్బారావు, ఎన్.ఆర్.ఐ నాయ‌కులు వ‌ల్ల‌భ‌నేని గిరి, మారెమ్మ‌ ఆలయ టస్ట్రు బోర్డు ఛైర్మన్ తేర్ల శ్రీనివాసరావు , ఎన్టీఆర్ జిల్లా టిడిపి కోశాధికారి నాదెళ్ల నాగమణి, రాష్ట్ర లీగ‌ల్ సెల్ కార్య‌ద‌ర్శి కొత్త‌ప‌ల్లి ఆనంద్ స్వరూప్, గ్రామ పార్టీ అధ్యక్షులు అరిగే శ్రీనివాసరావు, గంప‌ల గూడెం మండ‌లం పార్టీ అధ్య‌క్షుడు మానికొండ రామ‌కృష్ణ (ఎమ్.ఆర్.కె) విస్సన్నపేట ప‌ట్ట‌ణ‌ అధ్యక్షులు కొంగల‌ శ్రీనివాసరావు, తిరువూరు ప‌ట్ట‌ణ పార్టీ అధ్య‌క్షుడు మ‌ల్లెల శ్రీనివాసరావు , తెలుగుయువత రాష్ట్ర నాయకులు కవులూరి రాజా , జిల్లా నాయ‌కులు ఆకుల రాధాకృష్ణ, తిరువూరు వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీ ఉపాధ్యక్షులు కుక్క‌డ‌పు నాగేశ్వ‌ర‌రావు. సోసైటీ అద్య‌క్షుడు కంభంపాటి బద్రినాధ్, మండ‌ల తెలుగు యువ‌త నాయ‌కులు ముత్తం శెట్టి వంశీ, టిడిపి సీనియ‌ర్ నాయ‌కులు ఎన్.టి వెంక‌టేశ్వ‌ర‌రావు, విస్స‌న్న పేట టౌన్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు చిన్నోడు, తెలుగు యువ‌త నాయ‌కులు రాయ‌ల కిట్టు, మాజీ ఎంపిపి ముత్తంశెట్టి వెంక‌టేశ్వ‌ర‌రావు, తెలుగు యువ‌త నాయ‌కులు తుమ్మ‌ల‌ప‌ల్లి అనిల్, తుమ్మ‌ల‌ప‌ల్లి సునీల్ మాజీ ఎంపిపి గ‌ద్దె వెంక‌టేశ్వ‌ర‌రావు, మాజీ ఎంపిటిసి కావూరి బాబు, జెడ్పీటిసీ మాజీ స‌భ్యులు మ‌ట్టా వేణుగోపాల‌రావు, టిడిపి దళిత నాయకులు బొద్దుకోళ్ల ప్రేమరాజ ల‌తో పాటు ఎన్డీయే కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే సీఎం చంద్రబాబు లక్ష్యం : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)

దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *