Breaking News

రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే సీఎం చంద్రబాబు లక్ష్యం : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)

ఐదుగురు లబ్ధిదారులకు రూ.12,24,110 విలువైన ఎల్.వో.సి పత్రాలు అందజేత

ఎ. కొండూరు మార్చి 6 (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని జయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. పేద ప్రజలు ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా వారిని ఆదుకుంటున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు ఎపిని అభివృద్ది పథం వైపు నడిపించటంతోపాటు, రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఎంపీ కేశినేని శివనాథ్( చిన్ని) వివరించారు.గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో గురువారం సీఎంఆర్ ఎఫ్ కింద మంజూరైన రూ.12,24,110 విలువైన ఎల్.వో.సి పత్రాలను ఎంపి కేశినేని శివనాథ్ ఐదుగురు లబ్ధిదారులకు రాష్ట్ర సాంఘీక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య, తిరువూరు నియోజకవర్గ పరిశీలకులు సుఖవాసి శ్రీనివాస్‌లతో కలసి అందజేశారు.తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన బండి శ్రీలక్ష్మీ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా ఆమెకు వైద్య చికిత్స కోసం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.6 లక్షల రూపాయల ఎల్.వో.సి పత్రాన్ని ఆమె కుటుంబసభ్యులకు ఎంపి కేశినేని శివనాథ్ అందజేశారు.
అదే విధంగా రోడ్డు ప్రమాదంకు గురై తీవ్ర గాయాల పాలైన తిరువూరు నియోజకవర్గం ఎ కొండూరు మండలం చీమలపాడుకు చెందిన భూక్యా లోకేష్‌కు రూ.1,77,044, అదే గ్రామానికి చెందిన భూక్యా ఉపేంద్ర కు రూ.2,13,916 చొప్పున వైద్య చికిత్స కోసం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఎల్.వో.సి పత్రాలను ఎంపీ శివనాథ్ అందజేశారు.అదే రీతిలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మల్లిఖార్జునపేటకు చెందిన కలవకొల్లు దుర్గాభవానీ మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా ఆమెకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ1,60,225 విలువైన ఎల్.వో.సి పత్రాన్ని ఎంపీ శివనాథ్ ఆమె కుటుంబసభ్యులకు అందజేశారు. విజయవాడకు చెందిన మేకా శేషగిరిరావు హెర్నీయా సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా వైద్య చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.72,925 విలువైన ఎల్ఓసి పత్రాన్ని శేషగిరిరావుకు ఎంపీ అందజేశారు. తమకి సీఎంఆర్ఎఫ్ కింద ఎల్.వో.సిలు మంజూరు అయ్యే విధంగా సాయం చేసిన ఎంపి కేశినేని శివనాథ్ కి లబ్ధిదారులు, లబ్ధిదారుల కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎ.కొండూరు మండలటిడిపి అధ్యక్షులు భరోతు పీక్లా నాయక్, ఎన్టీఆర్ జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి బి భీమానాయక్ చీమలపాడు పీఏసీఎస్ అధ్యక్షుడు బెజవాడ శంకర్ చీమలపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొండెపాటి సుబ్బారావు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ ఆదం షరీఫ్ ఎన్డీయే కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

శ్రీ మారెమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా ఎంపీ కేశినేని శివనాథ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *