Breaking News

“శంకుస్థాపన చేసింది నేనే… నీళ్లు ఇచ్చేదీ నేనే”: చంద్రబాబు

అమరావతి,mar 07, నేటి తెలుగు పత్రిక: వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు. 1996 మార్చి 5న తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెలిగొండ ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన రోజు ఇప్పటికీ గుర్తుందని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం తీవ్ర తాగునీటి, సాగునీటి కొరతతో బాధపడుతుండటంతో ప్రజల సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించామని సీఎం పేర్కొన్నారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో సుమారు 4.38 లక్షల ఎకరాలకు సాగునీరు, అలాగే 15 లక్షల మందికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపారు.తరువాతి ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పనులు నెమ్మదించాయని, అయితే 2014 నుంచి 2019 మధ్య ప్రాజెక్టు పనులను వేగవంతం చేశామని చెప్పారు. ఆ సమయంలో సుమారు రూ.1,414 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. అనంతరం వచ్చిన ప్రభుత్వం పూర్తి చేయకుండానే ప్రారంభోత్సవం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించిందని విమర్శించారు.

మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే అకౌంట్‌లో రూ.లక్ష జమ!

2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ పనులకు మళ్లీ ప్రాధాన్యం ఇచ్చామని సీఎం పేర్కొన్నారు. ఇప్పటికే పెండింగ్ బిల్లుల చెల్లింపులకు రూ.140 కోట్లు విడుదల చేశామని, ప్రాజెక్టు నిర్మాణానికి రూ.585 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ వంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.ఈ ఏడాది జూలై నాటికి ఫేజ్-1 పనులు పూర్తి చేసి వెలిగొండకు కృష్ణా నీటిని తీసుకురావాలని, అలాగే 2027-28 నాటికి ఫేజ్-2 పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. “వెలిగొండకు శంకుస్థాపన చేసింది నేనే… పూర్తి చేసి నీళ్లిచ్చేదీ నేనే” అంటూ సీఎం చంద్రబాబు తన సంకల్పాన్ని వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *