బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు

Mar 07, నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ రాష్ట్ర మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళల పాత్ర, వారి సాధికారతపై ఆయన ప్రత్యేక సందేశం విడుదల చేశారు.గవర్నర్ తన సందేశంలో మాట్లాడుతూ.. మన దేశంలో మహిళలు స్వాతంత్ర్య ఉద్యమం నుండి ఇప్పటి వరకు జాతీయ సమగ్రత, శాంతి, సామరస్యాన్ని కాపాడడంలో గొప్ప పాత్ర పోషించారని పేర్కొన్నారు. సమాజానికి మహిళలు ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తున్నారని అన్నారు.

సమాజం, రాజకీయాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మహిళల విజయాలను గుర్తించి వెలుగులోకి తీసుకురావడానికి అలాగే సమానత్వం, న్యాయం, గౌరవం కోసం మహిళల హక్కులపై అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను జరుపుకుంటామని తెలిపారు.మన సమాజంలో, కుటుంబ వ్యవస్థలో, జాతి నిర్మాణంలో మహిళలు కీలక నాయకత్వ పాత్ర పోషిస్తున్నారని గవర్నర్ పేర్కొన్నారు. సహనం, పట్టుదలతో అనేక బాధ్యతలను మోస్తూ సమాజ అభివృద్ధికి మహిళలు విశేషంగా తోడ్పడుతున్నారని ఆయన ప్రశంసించారు. మహిళల ఈ ప్రత్యేక శక్తి దేవుడు ఇచ్చిన వరమని కూడా గవర్నర్ పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్