బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 ప్రకటింపు.. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు

గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 ప్రకటింపు.. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు

హైదరాబాద్,Mar 07, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిలిం అవార్డ్స్ – 2025 విజేతల తుది జాబితా విడుదలైంది. ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్ పేరిట ఈ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. జ్యూరీ సభ్యులు తుది జాబితాను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందజేశారు.ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, నటుడు తనికెళ్ళ భరణి, రోజా రమణి, సంగీత దర్శకుడు మణి శర్మ, నటి ప్రగతి తదితరులు పాల్గొన్నారు. జ్యూరీ చైర్మన్ మణిశర్మ ఆధ్వర్యంలో విజేతల జాబితాను అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికు ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ ప్రకటించారు. అలాగే ప్రముఖ నటి జయసుధకు అక్కినేని నాగేశ్వరరావు అవార్డు ప్రకటించారు.దాదాపు 14 సంవత్సరాల విరామం తర్వాత నంది అవార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో ఈ అవార్డులను అందజేస్తోంది. ఈ ఏడాది మొత్తం 17 ప్రధాన విభాగాలతో పాటు పలు ప్రత్యేక పురస్కారాలను కూడా ప్రకటించారు.

గద్దర్ ఫిలిం అవార్డ్స్ – 2025 విజేతలు

ఉత్తమ నటుడు: నాగ చైతన్య (తండేల్)
ఉత్తమ నటి: రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)
ఉత్తమ చిత్రం: రాజు వెడ్స్ రాంబాయి
ఉత్తమ ద్వితీయ చిత్రం: దండోరా
ఉత్తమ తృతీయ చిత్రం: ది ప్రీ వెడ్డింగ్ షో
నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా: తండేల్
ఉత్తమ పర్యావరణ చిత్రం: ఇగ్వా
ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్: లిటిల్ హార్డ్స్
ఉత్తమ వినోదాత్మక చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం
ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం: కోర్టు
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ: మిరాయ్
ఉత్తమ బాలల చిత్రం: అనగనగనా

ఉత్తమ దర్శకుడు: సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ సపోర్టింగ్ నటుడు: శివాజీ
ఉత్తమ సపోర్టింగ్ నటి: భూమిక

ఉత్తమ సంగీత దర్శకుడు: మార్క్ కె రాబిన్ (దండోరా)
ఉత్తమ నేపథ్య గాయకుడు: అనురాగ్ (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ నేపథ్య గాయని: సాహితి చాగంటి (కన్నప్ప)

ఉత్తమ హాస్యనటుడు: కృష్ణ తేజ (జిగ్రీస్)
ఉత్తమ బాలనటుడు: రోహన్ రాయ్ (ప్రీ వెడ్డింగ్ షో)

ఉత్తమ కథా రచయిత: గుణశేఖర్ (యుఫోరియా)
ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్: Anil Ravipudi
ఉత్తమ గేయ రచయిత: నందకిశోర్ (కుబేర)

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఉత్తమ సినిమాటోగ్రాఫర్: కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
ఉత్తమ ఎడిటర్: Sreekar Prasad (మిరాయ్)
ఉత్తమ ఆడియోగ్రాఫర్: ఎం.ఆర్. రాధాకృష్ణన్ (కిష్కిందపురి)

ఉత్తమ కొరియోగ్రాఫర్: గిర గిర గిర
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి (చాంపియన్)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: గోవింద్ (అఖండ)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: చంద్రకాంత్ (చాంపియన్)

స్పెషల్ జ్యూరీ ఫిల్మ్: 23
ఉత్తమ మేల్ యాక్టర్: చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ నటి: అనంతిక (8 వసంతాలు)
స్పెషల్ జ్యూరీ హీరో: రోషన్ (చాంపియన్)

ప్రత్యేక పురస్కారాలు

పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు: Kamal Haasan
బి.ఎన్.రెడ్డి ఫిల్మ్ అవార్డు: Singeetam Srinivasa Rao
గిరెడ్డి–చక్రపాణి అవార్డు: C. Aswani Dutt
కాంతారావు అవార్డు: R. Narayana Murthy
ఘుపతి వెంకయ్య అవార్డు: రమేష్ ప్రసాద్ (ప్రసాద్ ల్యాబ్స్)
సి. నారాయణ రెడ్డి ఫిల్మ్ అవార్డు: సుద్దాల అశోక్ తేజ

తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభను గుర్తిస్తూ ఈ అవార్డులు ప్రకటించబడటంపై సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.