బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు.. రైతులకు మంత్రి సరిత పిలుపు

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు.. రైతులకు మంత్రి సరిత పిలుపు

మార్చి 7(నేటి తెలుగు పత్రిక): ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించారు. నగరంలోని Fortune Murali Parkలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యా రాణి (సరిత) ప్రెస్‌మీట్ నిర్వహించి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం రైతులకు, సమాజానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ప్రాచీన కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో పాటించిన ఆహారపు అలవాట్లలో నవధాన్యాలు, చిరుధాన్యాలు కీలక పాత్ర పోషించాయని తెలిపారు. ఆహార భద్రతకు, ఆరోగ్యకర జీవనశైలికి ఆర్గానిక్ వ్యవసాయం ఎంతో అవసరమని వివరించారు.

రైతు దేశానికి వెన్నుముక అని, దేశాన్ని కాపాడే సైనికులతో పాటు రైతులను కూడా సమాజం గౌరవించాలని మంత్రి పిలుపునిచ్చారు. పంట నష్టం జరిగినా తిరిగి కష్టపడి పంటలు పండించే రైతులకు ప్రభుత్వం తగిన సహాయం అందించాలని అన్నారు.ప్రస్తుతం సమాజంలో క్యాన్సర్ వంటి వ్యాధులు పెరగడానికి ప్రధాన కారణం రసాయనాలు, క్రిమిసంహారక మందులతో పండించిన ఆహారమేనని ఆమె పేర్కొన్నారు. అందుకే ప్రజలు తమ ఆహారపు అలవాట్లను మార్చుకుని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు.ఆధునిక కాలంలో ఆరోగ్యకర జీవన విధానాన్ని అవలంబిస్తూ ఆర్గానిక్ ఫార్మింగ్‌కు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని, రైతులకు తోడ్పాటునందించాలని మంత్రి సరిత పిలుపునిచ్చారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్