Breaking News

మహిళా సాధికారత కోసం.. గివ్ టూ గైన్.

ఆకాశంలో సగం, అవకాశాలలో సగం.
మహిళా సాధికారత కోసం మద్దతు
.

మహిళాభ్యున్నతి లేని అభివృద్ధి నిరర్థకం.

ఇరాన్ పై సామ్రాజ్యవాద అమెరికా, ఇజ్రాయిల్ దాడిని ఖండించండి: సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

మహిళా సాధికారత.. చట్టాలు అమలతోనే సాధ్యం.

సామాజిక ఆచారాలుతో , మహిళా అభ్యున్నతి మందగమనం.

సంపూర్ణ సాధికార‌తే నిజ‌మైన మ‌హిళాభ్యుద‌యం

కోదాడ ,మార్చి 7(నేటి తెలుగు పత్రిక): మహిళా సాధికారత లేని అభివృద్ధి నిరర్థకం, మహిళాభ్యున్నతి ,సాధికారత , వివక్షత నివారణ కోసం చట్టాలు చేయడమే కాదు వాటినీ అమలు చేయడమే కీలకం. అని సామాజిక ఆర్థిక విద్య విశ్లేషకులు బడుగుల సైదులు శని వారం నాడు కోదాడ పట్టణంలో మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పత్రికా విలేకరులతో మాట్లాడి తన అభిప్రాయాలను తెలియజేసినారు.మహిళలకు హక్కులు, రిజర్వేషన్లు కల్పించడం కాదు, వాటిని గుర్తించడం, వారు అనుభవించే విధంగా చేయడమే ముఖ్యం. జనాభాలో సగం అయిన మహిళలకు, అవకాశాల్లో సగం కల్పించడం మనందరి కర్తవ్యం. 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇతివృత్తం ” గివ్ టు గైన్” (లాభం కోసం ఇవ్వండి) ఒకరికి ఒకరు సహాయం చేస్తే అందరికీ ప్రయోజనం కలుగుతుంది అనే సూత్రానికి కట్టుబడి స్త్రీ పురుషులందరూ జీవన విధానం కొనసాగించాలని తెలిపారు. భారతదేశంలో కొన్ని రంగాలలో వేగంగా అభివృద్ధిని సాధిస్తున్నప్పటికీ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం మార్పులు బలహీనంగానే ఉన్నవి, నేటికీ మహిళల పట్ల వివక్షత బహుముఖంగా కొనసాగుతున్నది. విద్యా, ఉపాధి ,ఆరోగ్యం, నిర్ణయాధికారం ,ఆస్తి హక్కు లలో మహిళలు వివక్షత, హింసకు గురి అవుతున్నారు. ఇది భారత జాతికి కళంకము, మహిళా వివక్షత దేశ అభివృద్ధికి చేటు. ఆక్స్ఫం ఇండియా రిపోర్ట్ 2022 ప్రకారం పురుషులతో సమాన అర్హతలు ఉన్నప్పటికీ మహిళలు 64% తక్కువ వేతనాలను పొందుతున్నారు. ఆడపిల్లలకు తక్కువ విలువ ఇవ్వడం, గృహపనులకే పరిమితం చేయటం, బాల్యవివాహాలు వంటి సామాజిక ఆచారాలు ఇప్పటికి కొనసాగుతున్నాయి. ఆడపిల్లల అక్రమ రవాణా, తక్కువ విద్య, ఆస్తి హక్కులు లేకపోవడం, ఇలాంటి విషయాలలో చట్టాలు ఉన్నప్పటికీ అమలులో బలహీనతగా ఉన్నది. రాజకీయ నిర్ణయ అధికారంలో స్థానిక సంస్థలలో 50% రిజర్వేషన్లు ఉన్నప్పటికీ తరచుగా కుటుంబ సభ్యుల పెత్తనం కొనసాగుతున్నది. భారతదేశంలో మహిళల సాధికారత బలహీనంగా ఉండటానికి మహిళలు వివక్షత గురికావడానికి ప్రధానంగా ఆస్తిపై పట్టు లేకపోవడం ,పురుష ఆధిక్య ,వారసత్వం స్వభావం, మహిళా చైతన్య లోపం, మహిళను వ్యాపార వస్తువుగా చూడటం, మహిళా రక్షణ చట్టాలు పటిష్టంగా అమలు కాకపోవటం, బాల్యవివాహాలు, కట్నం , వివాహం చేసి అత్తవారింటికి పంపించడం, సమాజంలో నైతికత దిగజారటం, మారుతున్న సంస్కృతి ప్రభావంగా మహిళలు సమాజంలో సరైన గౌరవాన్ని, అవకాశాలను పొందలేకపోతున్నారు.
మహిళా ప్రసూతి ప్రయోజన చట్టం 2017, లైంగిక వేధింపుల నివారణ చట్టం 2013, సమాన వేతన చట్టం 1976 పటిష్టంగా అమలు కాకపోవడం వలన మహిళా సాధికారత బలహీనంగా ఉంటున్నది.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సాధికారతను సాధించి, భారతదేశ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెరుగుదలకు, మహిళా అభ్యున్నతి కోసం మద్దతునివ్వాలి, విద్య ,ఆరోగ్యం, ఉపాధి, ఆస్తి హక్కు లలో వివక్షత నిర్మూలన పట్ల సమాజంలో మహిళా అభ్యుదయవాదులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, ప్రభుత్వాలు, ప్రతి ఒక్కరూ.. మహిళల పట్ల ” గివ్ టు గైన్” (పరస్పరం, ఒకరికి మరొకరు “”లాభం కోసం ఇవ్వండి””) పాటించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *