Breaking News

7 నుంచి 12వ తరగతి బాలికలకు ఉచిత శానిటరీ న్యాప్‌కిన్‌లు.. శాసనమండలిలో లోకేష్ ప్రకటన

అమరావతి,mar 07, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లను అందిస్తున్నట్లు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనమండలిలో సభ్యురాలు కావలి గ్రీష్మ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థినులకు ఈ సదుపాయం అందిస్తున్నామని చెప్పారు. గతంలో ఒక్కో బాలికకు 7 రెగ్యులర్ సైజ్, 3 లార్జ్ సైజ్ న్యాప్‌కిన్‌లు ఇచ్చేవారని, విద్యార్థినుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఇప్పుడు 5 రెగ్యులర్ సైజ్, 5 లార్జ్ సైజ్ శానిటరీ ప్యాడ్‌లు అందిస్తున్నట్లు తెలిపారు.గత ప్రభుత్వ కాలంలో రూ.18.96 కోట్ల బకాయిలు ఉండగా, ప్రస్తుత ప్రభుత్వం వాటిని చెల్లించినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. ఆర్టీజీఎస్ నుంచి ఐవీఆరెస్ ద్వారా విద్యార్థినుల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరిస్తున్నామని చెప్పారు.

తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు 9 నుండి ఎయిర్ ఫోర్స్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ

ఫీడ్‌బ్యాక్ ప్రకారం

  • 96% మంది బాలికలకు శానిటరీ న్యాప్‌కిన్‌లు అందుతున్నాయి
  • 4% మందికి అందడం లేదని తెలిపారు
  • నాణ్యత విషయంలో 85% మంది బాగుందని, 14% మంది ఫర్వాలేదని, 1% మంది బాగాలేదని చెప్పారు
  • ఎబ్సార్ప్షన్ విషయంలో 84% మంది బాగుందని, 14% పర్వాలేదని, 2% బాగాలేదని ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు

అలాగే ఎకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్స్ పంపిణీపై కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తుందని మంత్రి తెలిపారు. ఎన్జీవోలతో కలిసి బాలికల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు.ఇప్పటికే కేజీబీవీ పాఠశాలల్లో స్మార్ట్ కార్డ్‌తో పనిచేసే వెండింగ్ మెషిన్లు పైలట్ ప్రాజెక్ట్‌గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో అన్ని పాఠశాలలకు విస్తరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.అదే సమయంలో **HPV vaccine**పై అవగాహన కల్పించడం అవసరమని మంత్రి పేర్కొన్నారు. దీనిపై సమాజంలో ఉన్న అపోహలను తొలగిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ మాట్లాడుతూ, నెలసరి సమయంలో సరైన హైజీన్ ఉత్పత్తులు లేకపోవడం వల్ల విద్యార్థినులు పాఠశాలకు గైర్హాజరవుతున్నారని పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదువుతున్న బాలికలకు ఎకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్స్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

16న పొట్టి శ్రీరాముల విగ్రహావిష్కరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *