బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

‘మా పిల్లలు బంగారం’.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు లోకేష్ ప్రశంస

‘మా పిల్లలు బంగారం’.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు లోకేష్ ప్రశంస

తిరుపతి,mar 07, నేటి తెలుగు పత్రిక: నీతి, నిజాయితీ విషయంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు బంగారం లాంటివారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. తిరుపతి జిల్లాలో జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న మంత్రి లోకేష్.. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ విద్యార్థినుల నిజాయితీని అభినందించారు.తిరుపతి జిల్లా వెంకటగిరి జెడ్పీ బాలికల హైస్కూల్‌లో చదువుతున్న విద్యార్థినులు గురువారం సాయంత్రం స్కూల్ ముగిసిన తర్వాత మన్నవరం బస్సుకోసం వెంకటగిరి ఎస్బీఐ బ్యాంకు వద్ద వేచి ఉండగా రోడ్డుపై ఒక పర్సు కనిపించింది. కొత్తపల్లిగుంటకు చెందిన 8వ తరగతి విద్యార్థినులు బి. గురుప్రియ, బి. గీతిక, ఎం. గీతికతో పాటు 6వ తరగతి విద్యార్థిని పద్మశ్రీ, 7వ తరగతి విద్యార్థిని హేమలత ఆ పర్సును తీసి చూడగా అందులో బంగారు నగలు, నగదు ఉన్నట్లు గుర్తించారు.

అయితే ఎలాంటి ఆలోచన లేకుండా ఆ విద్యార్థినులు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పర్సును అక్కడి ఎస్ఐ స్వరూపాకు అప్పగించారు. అనంతరం వారు తిరిగి బస్టాప్‌కు వెళ్లగా, పర్సు కోసం వెతుకుతున్న ఓ మహిళ వారిని అడగడంతో, తమకు దొరికిందని మరియు పోలీస్ స్టేషన్‌లో ఇచ్చామని తెలిపారు. తర్వాత ఆమెతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.ఆ మహిళకే పర్సు చెందినదని నిర్ధారించిన పోలీసులు అందులోని నగలు, నగదును ఆమెకు తిరిగి అందజేశారు.ఈ ఘటనపై స్పందించిన మంత్రి నారా లోకేష్ ఎక్స్‌లో పోస్టు చేస్తూ, “చిన్న వయస్సులో మీ నిజాయితీ ఆదర్శంగా నిలిచింది చెల్లెమ్మలూ. మీలాంటి విద్యార్థినులు ఉన్నందుకు గర్వంగా ఉంది. మీ నిజాయితీతో విద్యాశాఖ గౌరవం మరింత పెరిగింది” అని పేర్కొన్నారు. విద్యార్థినుల నీతి, నిజాయితీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్