గౌరవ డిజిపి, శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ చీఫ్ శ్రీ ఆకే రవి కృష్ణ, ఐపిఎస్, ఐజిపి గారి పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ వారి ఉత్తర్వుల మేరకు జిల్లాలో మార్చి 7న మెగా ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్స్ చేపట్టారు.
ఏకకాలంలో విజయనగరం సబ్ డివిజన్ పరిధిలో 1వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని జోన్నగుడ్డిలో, బొబ్బిలి సబ్ డివిజన్ పరిధిలో బొబ్బిలి పోలీసు స్టేషన్ పరిధిలోని మల్లంపేట గ్రామంలో మరియు చీపురుపల్లి సబ్ డివిజన్ పరిధిలో సంతకవిటి పోలీసు స్టేషన్ పరిధిలోని తలాడ గ్రామంలో సుమారు 400మంది పోలీసు అధికారులు, సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
అదనపు ఎస్పీ శ్రీమతి పి.సౌమ్యలత గారి పర్యవేక్షణలో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు ఆధ్వర్యంలో విజయనగరం సబ్ డివిజన్ పరిధిలో తనిఖీలు నిర్వహించగా, బొబ్బిలి సబ్ డివిజన్ పరిధిలో డిటిసి డిఎస్పీ, ఎం.వీరకుమార్, చీపురుపల్లి సబ్ డివిజన్ పరిధిలో చీపురుపల్లి డిఎస్పీ, ఎస్.రాఘవులు ఆధ్వర్యంలో సుమారు 1600 ఇండ్లలో తనిఖీలు నిర్వహించారు.
అదనపు ఎస్పీ శ్రీమతి పి.సౌమ్యలత గారు స్వయంగా ఈ ఆపరేషన్లో పాల్గొని తనిఖీలు నిర్వహించారు, ఈగల్ టీం అధికారులు మరియు సభ్యలు కూడా ఇందులో పాల్గొన్నారు.
రికార్డులు సక్రమంగాలేని మొత్తం 60 మోటారు సైకిళ్ళును సీజ్ చేసి, సంబంధిత పోలీసు స్టేషనుకు తరలించిన పోలీసులు.
విజయనగరం, mar 07, నేటి తెలుగు పత్రిక: గౌరవ డిజిపి, శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ చీఫ్ శ్రీ ఆకే రవి కృష్ణ,ఐపిఎస్,ఐజిపి గారి పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ వారి ఉత్తర్వుల మేరకు జిల్లాలో మార్చి 7న తెల్లవారుజామున 5 గంటల నుండి జిల్లాలో మెగా ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్స్ చేపట్టారు. “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా ప్రజల రక్షణ, భద్రత, నేరాలు నియంత్రణ, గంజాయి నిర్మూలన, అనుమానిత వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడమే లక్ష్యంగా ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్స్ నిర్వహించామని తెలిపారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ పి.సౌమ్యలత మాట్లాడుతూ – జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు ఆధ్వర్యంలో విజయనగరం సబ్ డివిజన్ పరిధిలో 1వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని జోన్నగుడ్డి ప్రాంతంలో 150మంది పోలీసు అధికారులు, సిబ్బంది, ఈగల్ టీం అధికారులు మరియు సభ్యలుతో బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. ప్రజల రక్షణ, భద్రత, నేరాలు నియంత్రణ, గంజాయి నిర్మూలన, అనుమానిత వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడమే లక్ష్యంగా సుమారు 100 ఇండ్లలోను, బహిరంగ ప్రదేశాల్లో ఆకస్మికంగా సోదాలు నిర్వహించామన్నారు. జోన్నగుడ్డి ప్రాంతంలో అన్ని ఇండ్లలో ఆకస్మికంగా సోదాలు నిర్వహించి, అపరిచత వ్యక్తుల వివరాలు సేకరించి, వారి వ్రేలి ముద్రలను ఎం. ఎన్.సి.డి. పరికరాలతో తనిఖీలు చేసామన్నారు. అదే విధంగా వారి వద్ద లభించిన వాహనాల రికార్డులను పరిశీలించి, రికార్డులు సక్రమంగాలేని 22 ద్విచక్ర వాహనాలను తదుపరి చర్యల నిమిత్తం పోలీసు స్టేషనుకు తరలించామన్నారు. అనుమానిత వ్యక్తులు పారిపోయేందుకు అవకాశం ఉన్న మార్గాలను ముందుగా గుర్తించి, ఆయా మార్గాలను పోలీసు బృందాలతో ముందుగానే దిగ్భందనం చేసామన్నారు. రాబోయే రోజుల్లో “ఆపరేషన్ వజ్రప్రహార్”భాగంగా ఇదే తరహాలో జిల్లాలో తరుచూ మరిన్ని ప్రాంతాల్లో “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్స్ ఆకస్మికంగా చేపట్ట నున్నామన్నారు. జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ వారి సూచనలు, ఆదేశాలమేరకు ఈ ఆపరేషన్లో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందితో సంబంధిత ఇంచార్జ్ అధికారులు మమేకమై “కార్డన్ అండ్ సెర్చ్” ఉద్ధేశ్యాన్ని, ఈ ఆపరేషన్ లో అధికారులు, సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను వివరించి, ప్రజలెవ్వరితో దురుసుగా వ్యవహరించ వద్దని దిశా నిర్దేశం చేసారు. కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషనులో ఎటువంటి నిషేధిత వస్తువులు, గంజాయి, నాటుసారావంటివి లభ్యం కాలేదన్నారు. జోన్నగుడ్డి ప్రాంతంలో ఉన్న హిస్టరీ షీట్ ఉన్న వ్యక్తులతో మాట్లాడి, వారి కదలికలపై నిత్యం నిఘా ఉంటుందని తెలిపారు. “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషను తరువాత గ్రామస్థులతో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత గారు సమావేశమై, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలు, రహదారి భద్రత, మహిళల రక్షణ చట్టాలపై గ్రామస్థులకు అవగాహన చేపట్టి, గంజాయి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే 1972కు గాని, డయల్ 100/112కు గాని, స్థానిక పోలీసు స్టేషన్ కు గాని సమాచారం అందించాలని ప్రజలను కోరారు. అనంతరం అదనపు ఎస్పీ పి.సౌమ్యలత గారు అక్కడ ఉన్న యువత, ప్రజలతో యాంటి డ్రగ్స్ పై ప్రతిజ్ఞ చేయించి, గంజాయి వలన కలిగే దుష్ప్రభావాలను వివరించి ఎవరు కూడా గంజాయి జోలికి వెళ్ళకుండా ఉండాలని కోరారు.
బొబ్బిలి సబ్ డివిజన్ పరిధిలో డిటిసి డిఎస్పీ, ఎం.వీరకుమార్ ఆధ్వర్యంలో బొబ్బిలి పోలీసు స్టేషన్ పరిధిలో మల్లంపేట గ్రామంలో సుమారు 125మంది పోలీసు అధికారులు, సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఆకస్మికంగా సోదాలు నిర్వహించి, అపరిచత వ్యక్తుల వివరాలు సేకరించి, వారి వ్రేలి ముద్రలను ఎం. ఎన్.సి.డి. పరికరాలతో తనిఖీలు చేసారన్నారు. అనంతరం అక్కడి యువత, ప్రజలతో ప్రతిజ్ఞ నిర్వహించారు. రికార్డులు సక్రమంగాలేని 30 మోటారు సైకిళ్ళును సీజ్ చేసి, సంబంధిత పోలీసు స్టేషనుకు తరలించిన పోలీసులు.
చీపురుపల్లి సబ్ డివిజన్ పరిధిలో చీపురుపల్లి డిఎస్పీ, ఎస్.రాఘవులు ఆధ్వర్యంలో సంతకవిటి పోలీసు స్టేషన్ పరిధిలో తలాడ గ్రామంలో సుమారు 125మంది పోలీసు అధికారులు, సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఆకస్మికంగా సోదాలు నిర్వహించి, అపరిచత వ్యక్తుల వివరాలు సేకరించి, వారి వ్రేలి ముద్రలను ఎం. ఎన్.సి.డి. పరికరాలతో తనిఖీలు చేసారన్నారు. అనంతరం అక్కడి యువత, ప్రజలతో ప్రతిజ్ఞ నిర్వహించారు. రికార్డులు సక్రమంగాలేని 10 మోటారు సైకిళ్ళును సీజ్ చేసి, సంబంధిత పోలీసు స్టేషనుకు తరలించిన పోలీసులు.
“కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషను అనంతరం గ్రామస్థులతో సమావేశమై, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలు, రహదారి భద్రత, మహిళల రక్షణ చట్టాలపై గ్రామస్థులకు అవగాహన చేపట్టి, గంజాయి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే 1972కు గాని, డయల్ 100/112కు గాని, స్థానిక పోలీసు స్టేషన్ కు గాని సమాచారం అందించాలని ప్రజలను కోరారు. గంజాయి వలన కలిగే దుష్ప్రభావాలను వివరించి ఎవరు కూడా గంజాయి జోలికి వెళ్ళకుండా ఉండాలని పోలీసు అధికారులు ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, డిటిసి డిఎస్పీ ఎం.వీరాకుమార్, ఈగల్ టీం ఆర్ఐ టి.ధనుంజయ నాయుడు, సిఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.





