Breaking News

పామర్రు లో ఆపరేషన్‌ ‘వజ్ర ప్రహార్‌’

పామర్రు మార్చి 07( నేటి తెలుగు పత్రిక ): మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా ప్రభుత్వం తీసుకున్న లక్ష్యానికి ప్రజలు సహకరించాలని కోరారు.శనివారం తెల్లవారుజామున నియోజకవర్గం కేంద్రం మైన పామర్రు పట్నం లోని నాగులేరు గట్టున గల రావి హర గోపాల్ నగర్ కాలనీ లో పోలీసులు ‘వజ్ర ప్రహార్‌’ (నిర్బంధ తనిఖీలు) చేపట్టారు. పలు గృహల్లో కొన్ని బృందాలగా విడి పోయి సోదాలు కొనసాగించారు.ప్రతి ఇంటిని, అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంజాయి నిల్వలు, అక్రమ రవాణా, ఇతర అక్రమ కార్యకలాపాలకు పాల్పడే అనుమానితులపై ప్రత్యేకంగా నిఘా పెట్టామన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 30 వాహనాలను సీజ్‌ చేస్తుమ న్నారు. ఈ సందర్భంగా ఈగల్‌ ఎస్పీ మహేశ్వర రాజు, డి.ఎస్.పి కొసూరి ధర్మేంద్రలు మాట్లాడుతూ, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్‌ సాధనే ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నేడు 100 ప్రాంతాల్లో ఆపరేషన్‌ వజ్రప్రహార్‌ కార్డెన్‌ సెర్చ్‌ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో గంజాయి సరఫరా జరిగే 849 హాట్‌ స్పాట్స్‌ను పోలీస్ శాఖ గుర్తించిoదని వీటికి అడ్డుకట్ట వేసేందుకు తనిఖీలు కొనసాగుతున్నాయని వారు చెప్పారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, అలాంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని, అక్రమ వ్యాపారాలకు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీస్ శాఖ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు సిఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

పోక్సో కేసులో హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *