నేటి తెలుగు పత్రిక,08-03-2026 ఆదివారం:
మేషం
గృహంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి ఉంటుంది. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశముంది.
వృషభం
కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆర్థిక విషయాలు కొంత నిరుత్సాహం కలిగించవచ్చు. ప్రారంభించిన పనులు నెమ్మదిగా సాగుతాయి. దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. సహోద్యోగులతో చిన్న వివాదాలు రావచ్చు.
మిథునం
ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు. దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. పనుల్లో కొన్ని అవరోధాలు ఎదురవుతాయి. ఇంటా బయట శ్రమ ఎక్కువ అవుతుంది. వ్యాపారాలు మందగిస్తాయి. నిరుద్యోగులు ప్రయత్నించినా ఫలితం ఆలస్యంగా రావచ్చు.
కర్కాటకం
ముఖ్యమైన విషయాల్లో సన్నిహితుల సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల ప్రశంసలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సింహం
సన్నిహితులతో మాటపట్టింపులు రావచ్చు. అవసరమైన సమయంలో ధనం అందక కొంత ఇబ్బంది కలుగుతుంది. కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగించవచ్చు. వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలతో విశ్రాంతి తక్కువగా ఉంటుంది.
కన్య
కుటుంబ సభ్యుల నుంచి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. భూ కొనుగోలు–అమ్మకాలలో లాభం ఉంటుంది. వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.
తుల
వ్యాపార విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దీర్ఘకాలిక ఒత్తిడి పెరగవచ్చు. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉండటంతో జాగ్రత్త అవసరం. కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగించవచ్చు. ఉద్యోగాల్లో ప్రయత్నాలు అనుకున్నట్లు ఫలించకపోవచ్చు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది.
వృశ్చికం
సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులు ఇంటికి రావడం ఆనందాన్ని కలిగిస్తుంది. సోదరులతో ఉన్న వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాల్లో కీలక సమాచారం సేకరిస్తారు. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కొత్త వాహనం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
ధనస్సు
నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ప్రయాణాల్లో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మకరం
ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై మరింత జాగ్రత్త అవసరం. వ్యాపారాల్లో ఊహించని సమస్యలు రావచ్చు. నిరుద్యోగులకు ప్రయత్నాలు కొంత నిరుత్సాహం కలిగించవచ్చు.
కుంభం
చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాల్లో కొన్ని నిర్ణయాలను ఆకస్మికంగా మార్చుకోవాల్సి రావచ్చు. దూరపు బంధువులతో చిన్న విభేదాలు రావచ్చు. కొత్త పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం మరింత శ్రమించాలి.
మీనం
సన్నిహితులతో సఖ్యతగా ఉంటారు. ఉద్యోగాల్లో కొత్త ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొత్త వస్తువులు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. సోదరుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు ఉంటాయి.
