బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబాటు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబాటు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

నేటి తెలుగు పత్రిక,mar 09: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్.చంద్రబాబు నాయుడు తెలుగింటి ఆడపడుచులకు, తల్లులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడం నుంచి ప్రారంభమైన సాధికారత ప్రయాణం నేడు వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే స్థాయికి చేరిందని సీఎం తెలిపారు. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.

“తల్లికి వందనం”, స్త్రీశక్తి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఎన్టీఆర్ భరోసా వితంతు పింఛన్లు వంటి పథకాలు మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని తెలిపారు. అలాగే మెగా డీఎస్సీ ద్వారా 7,955 మంది మహిళలకు టీచర్ ఉద్యోగాలు, 993 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు.రాష్ట్రంలో ఐదు లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడం లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, ఇప్పటివరకు లక్ష మంది మహిళలను మైక్రో, ఎంఎస్ఎంఈ ఎంటర్‌ప్రెన్యూర్లుగా తయారు చేసినట్లు సీఎం తెలిపారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసం కేంద్రంతో కలిసి సర్వైకల్ క్యాన్సర్ నిరోధక ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కూడా చేపట్టామని చెప్పారు.మహిళల అభ్యున్నతి, భద్రత, గౌరవం, స్వేచ్ఛ కోసం ప్రభుత్వం అవసరమైన అన్ని కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్