Breaking News

మహిళల ఎదుగుదలే సీఎం చంద్రబాబు లక్ష్యం.. అమరావతిలో మహిళా దినోత్సవ వేడుకలు

అమరావతి, mar 09,నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి రాజధాని ప్రాంతంలోని రాయపూడిలో రాష్ట్రస్థాయి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్.చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. చిన్నారులు షర్మిల, మహిమతో పాటు మహిళా మంత్రులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఐదుగురు మహిళా పారిశ్రామికవేత్తలను సీఎం సత్కరించారు. అలాగే డ్వాక్రా గ్రూపుల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ కల్పించేందుకు రూపొందించిన “స్వయం ఏపీ” బ్రాండ్ పేరు, లోగోను ఆవిష్కరించారు. డ్వాక్రా సంఘాల ఆర్థికాభివృద్ధికి మద్దతుగా రూ.10,102 కోట్ల రుణాలకు సంబంధించిన మెగా చెక్కును మహిళలకు అందజేశారు. అదనంగా సెర్ప్ ఆధ్వర్యంలో 26 ఎంవోయూలు, ఇతర విభాగాల నుంచి 15 ఎంవోయూలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

ఏపీ స్కూల్స్‌లో కొత్త బోధన విధానం.. క్లిక్కర్‌తో ఇంటరాక్టివ్ క్లాసులు

కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి మాట్లాడుతూ ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ లక్షల్లో సంపాదిస్తున్నారని ఆమె అన్నారు. “సూపర్ సిక్స” పథకాలు మహిళలకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దగ్గుబాటి పురందేశ్వరి మాధవ్ మాట్లాడుతూ ప్రపంచాన్ని ముందుకు నడిపించే శక్తి మహిళలేనని అన్నారు. ప్రతి కుటుంబంలో కనీసం ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం, సమాజం, దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు.

మంగళగిరిలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన

ఈ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత, బీసీ సంక్షేమ మంత్రి సవిత, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *