బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

మహిళల ఆర్థిక సాధికారతకు 36 ఒప్పందాలు.. అమరావతిలో సెర్ప్, మెప్మా కీలక నిర్ణయం

మహిళల ఆర్థిక సాధికారతకు 36 ఒప్పందాలు.. అమరావతిలో సెర్ప్, మెప్మా కీలక నిర్ణయం

అమరావతి,mar 09,నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతి పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో మహిళల ఆర్థిక స్వావలంబనకు కీలక అడుగు పడింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం మరియు మున్సిపల్ ప్రాంతాలలో పేదరిక నిర్మూలనకు మిషన్ సంస్థలు వివిధ రంగాలకు చెందిన సంస్థలతో మొత్తం 36 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

ఎన్.చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన ఈ ఒప్పందాలు స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కుదిరాయి. మహిళా మైక్రో ఎంటర్‌ప్రైజెస్ ఏర్పాటు, ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ మార్కెటింగ్, ఆర్థిక మద్దతు వంటి అంశాల్లో ఈ ఒప్పందాలు దోహదం చేయనున్నాయి.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

మిల్లెట్స్, హ్యాండ్లూమ్ ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్, సీవీడ్ సాగు, వ్యవసాయం, ఆరోగ్య సేవలు, డిజిటల్ వ్యాపారాలు వంటి పలు రంగాల్లో మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ఈ భాగస్వామ్యాలు కుదిరాయి. “వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్‌ప్రెన్యూర్” లక్ష్యంతో గ్రామీణ, పట్టణ మహిళలను ఆర్థికంగా బలపర్చడమే ఈ ఒప్పందాల ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.