బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

TVK చీఫ్ విజయ్‌కు మళ్లీ సీబీఐ నోటీసులు.. మార్చి 10న విచారణకు హాజరు కావాలని ఆదేశం

TVK చీఫ్ విజయ్‌కు మళ్లీ సీబీఐ నోటీసులు.. మార్చి 10న విచారణకు హాజరు కావాలని ఆదేశం

Mar 09,నేటి తెలుగు పత్రిక: తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరోసారి నోటీసులు జారీ చేసింది. Karurలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి మార్చి 10న విచారణకు హాజరు కావాలని సమన్లు పంపింది.2025 సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన TVK పార్టీ బహిరంగ సభలో తీవ్ర తొక్కిసలాట జరిగింది. కేవలం 10 వేల మందికి అనుమతి ఉన్న కార్యక్రమానికి సుమారు 30 వేల మంది అభిమానులు రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. విజయ్ రాక సుమారు 7 గంటలు ఆలస్యం కావడంతో అభిమానులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడం వల్ల ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 9 మంది చిన్నారులు, 18 మంది మహిళలతో సహా మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ కేసులో ఇప్పటికే విజయ్ ను సీబీఐ రెండు సార్లు విచారించింది. జనవరి 12న మొదటి విడత, జనవరి 19న రెండో విడత విచారణలు దాదాపు 6 గంటల పాటు కొనసాగాయి. ఈ సందర్భంగా తొక్కిసలాట ఘటనకు TVK పార్టీకి సంబంధం లేదని, పరిస్థితి అదుపు తప్పకుండా ఉండాలనే ఉద్దేశంతో తాను అక్కడి నుంచి వెళ్లిపోయానని విజయ్ తన వాంగ్మూలంలో తెలిపినట్లు సమాచారంఇదే కేసులో TVK పార్టీ జనరల్ సెక్రటరీ బుస్సి ఆనంద్, ఎలక్షన్ మేనేజ్‌మెంట్ డివిజన్ జనరల్ సెక్రటరీ అధవ్ అర్జున, జాయింట్ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్, కరూర్ జిల్లా సెక్రటరీ మతియఝగన్‌లను కూడా సీబీఐ ఇప్పటికే విచారించింది.ఈ నేపథ్యంలో మార్చి 10న విజయ్ సీబీఐ కార్యాలయంలో హాజరవుతారా లేదా అన్న విషయంపై రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ