బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మార్చి 17న ఇందిరాపార్క్ వద్ద గీత కార్మికుల మహాధర్నా విజయవంతం చేయాలి

మార్చి 17న ఇందిరాపార్క్ వద్ద గీత కార్మికుల మహాధర్నా విజయవంతం చేయాలి

సూర్యాపేట ,మార్చి 9(నేటి తెలుగు పత్రిక): 2026-27 రాష్ట్ర బడ్జెట్ లో గీత కార్మికుల సంక్షేమానికి 5000 కోట్లు కేటాయించాలని, గత బడ్జెట్ లో కేటాయించిన 70 కోట్లు ఈ మార్చి నెల లోనే ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 17న ఉదయం 10 గంటల నుండి ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు గీత కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తుంది.ఫిబ్రవరి 17న సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గం ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేసినం. అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ని కలిసినం. వృత్తికి సంబంధించిన కొన్ని సమస్యలు పరిష్కరించారు. వారికి మనందరి తరపున ధన్యవాదాలు. పెండింగ్ ఎక్సిగ్రేషియా 3 కోట్లు వెంటనే ఇచ్చారు.మిగతా 11 కోట్లు ఇస్తామన్నారు. నీరాకేఫ్ ని తెరిపిస్తామన్నారు. దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియ ప్రారంభించారు. కాటమయ్య రక్షణ కవచం పంపిణీ చేస్తున్నారు. వృత్తి చేసే వాళ్లందరికీ ఇస్తామన్నారు. మిగతా సమస్యలు సభ్యులందరికీ జీవిత బీమా సౌకర్యం, కొత్త వారికి పెన్షన్, ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ 4 వేలకు, ఎక్సిగ్రేషియా 10 లక్షలకు పెంచుతామన్న వాగ్దానం అమలు కాలేదు.ఏజెన్సీ గీత కార్మికుల సమస్య పరిష్కారం కాలేదు. అందుకని మిగతా మన అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ మన సోదర వృత్తి సంఘాలతో కలిసి ఈ మహాధర్నా చేస్తున్నాం. రాష్ట్రం లోని గీతకార్మికులు, శ్రేయోభిలాషులు వేలాదిగా తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి