బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ.. క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి సీఎం ఆదేశాలు

ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ.. క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి సీఎం ఆదేశాలు

మార్చి 09, ( నేటి తెలుగు పత్రిక): ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు అత్యాధునిక శిక్షణ అందించేందుకు తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒలింపిక్స్, కామన్‌వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా రాష్ట్ర క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.క్రీడా మైదానాలు, శిక్షణ కేంద్రాలు, యూనివర్సిటీ నిర్మాణాలు వంటి అంశాలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో సీఎం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీy లో అంతర్జాతీయ ప్రమాణాల మైదానాలు, శిక్షణ సౌకర్యాలు కల్పించాలనే అంశంపై అధికారులు సమర్పించిన పలు డిజైన్లను సీఎం పరిశీలించారు.

ఇక గచ్చిబౌలి స్టేడియం ను పునరుద్ధరించడంతో పాటు అక్కడ ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు మరియు వివిధ క్రీడలకు అనుగుణంగా శిక్షణ సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు.అలాగే నగరంలోని కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియం, లాల్ బహదూర్ స్టేడియం, సరూర్‌నగర్ స్టేడియం లను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీ డా. కిషోర్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి