బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

నాలుగు స్తంభాల వద్ద 7 లక్షల వ్యయంతో మెట్లు,డ్రెయిన్ల నిర్మాణం

నాలుగు స్తంభాల వద్ద 7 లక్షల వ్యయంతో మెట్లు,డ్రెయిన్ల నిర్మాణం

44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి.

విజయవాడ, మార్చి 9, నేటి తెలుగు పత్రిక: స్థానిక 44వ డివిజన్ లోని నాలుగు స్తంభాల సెంటర్ వాణి బడ్డీ కొట్టు సందులో ఏడు లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా మెట్లు, డ్రైన్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి చెప్పారు. సోమవారం నూతన పనులకు కార్పొరేటర్ రత్నకుమారి పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రత్నకుమారి మాట్లాడుతూ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు వై సుజనా చౌదరి మార్గదర్శకత్వంలో 44 డివిజన్ లో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పారు. డివిజన్ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా తాము పని చేస్తున్నట్లు ఆమె వివరించారు. 44వ డివిజన్ తెలుగుదేశం నాయకులు మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ఎంపీ కేశినేని శివనాధ్, పశ్చిమ ఎమ్మెల్యే వై.సుజనా చౌదరి అహర్నిశం కృషి చేస్తున్నారని కొనియాడారు. 44వ డివిజన్ లోని కొండ ప్రాంతంలో అవసరమైన ప్రాంతాల్లో మెట్లు, డ్రైన్లు నిర్మాణం పనులు నిర్వహిస్తున్నామని, అలాగే అవసరమైన చోట్ల సంబంధిత పనులకు తగిన కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఏఈ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్యూనిటీ సెక్రటరీ హర్షిత, కాంట్రాక్టర్ బత్తుల వెంకటేష్, స్థానికులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్