తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య
సూర్యాపేట,mar 09, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర4వ మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం మార్చి 14న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరుగుతుందని ఈ ఆహ్వాన సంఘం సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పోరాటాల పురిటి గడ్డ మహబూబ్ నగర్ లో2026 మే చివరి వారంలో రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఈ మహాసభలు మూడు రోజులపాటు అత్యంత ఉత్సావంతమైన వాతావరణంలో జరుగుతాయన్నారు. ఈ మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుండి వెయ్యి మంది వ్యవసాయ కార్మిక ఉద్యమ ప్రతినిధులు, వ్యవసాయ నిపుణులు, ఆర్థికవేత్తలు హాజరుకారున్నట్టు చెప్పారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న అనేక చట్టాలను రద్దు చేస్తుందని విమర్శించారు. పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలపై వంటగ్యాస్ పై 60 రూపాయలు పెంచడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన ఇచ్చిన 6 గ్యారంటీలు నేటికీ అమలు కాలేదు అన్నారు. రైతాంగానికి రైతు భరోసా రైతుల అకౌంట్ లో జమ చేయలేదన్నారు. రైతులు కొండంత అండతో ఎదురుచూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12000 ఇస్తామని చెప్పిన రేవంత్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అవుతున్న నేటికీ ఇచ్చిన హామీని అమలు చేయలేదని విమర్శించారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో పేదలు ఇండ్ల స్థలాల కోసం భూదాన్ భూముల్లో గుడిసెలేసుకొని నివాసం ఉంటున్న పేదలపై బుల్డోజర్ల ద్వారా దాడి చేసి 700 మందిని నిర్వాసితులు చేసిందన్నారు. ప్రభుత్వం తక్షణమే అర్హులైన వారందరికీ ఇంటి స్థలానికి పట్టా ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. సర్వం కోల్పోయిన పేదలకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలన్నారు. బుల్లోజర్ల పాలన కొనసాగిస్తున్న రేవంతును ప్రజలు ఓడించడం ఖాయమన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకునేందుకు ఊరూర ఉద్యమం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్ రాములు
అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీని రక్షించేది కోసం ఊరూరా ఉద్యమిస్తామని అన్నారు.ఉపాధి కూలీల పొట్ట కొట్టే వీబీ జీ రామ్ జీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలని కోరారు.కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టంలో పనికి హామీ లేకపో వడంతోపాటు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై పేదలు ఆధార పడవలసిన దుస్థితి నెలకొందని విమర్శించారు.దేశ ప్రజల ఉపాధికి తూట్లు పొడిచి, కోట్లాదిమంది పేద ప్రజల ఉపాధి దెబ్బ తీయడమే బీజేపీ దేశభక్తిన అని ప్రశ్నించారు.కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసి వారి ప్రయోజనాలకు పెద్దపీట వేసిన కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు కూలీ చెల్లించడానికి ఇన్ని రకాల ఇబ్బందులకు గురి చేయటం ఏమిటని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం కాదని ముమ్మాటికి కార్పోరేట్ శక్తులకు అనుకూల ప్రభుత్వమని మరోమారు రుజువైందన్నారు.కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం,కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇస్తామని చెప్పడం పేద కూలీలకు ద్రోహం చేసినట్లు కాదా అని అన్నారు.పార్లమెంట్ లో హడావిడిగా బిల్లులు ఎందుకు బిల్లు తెచ్చారు దేశ ప్రజలకు బిజెపి సమాధానం చెప్పాలన్నారు.తక్షణమే ప్రజా వ్యతిరేక బిల్లులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే ఉపాధి హామీ కి కుంటిసాకులు చెప్తూ నిధుల్లో కోతలు విధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఉపాధి హామీలు ముఖము ఆధారిత ఫోటోలను రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఫోటో ఆధారిత హాజరు సందర్భంగా నెట్ వర్క్ సక్రమంగా లేకపోవడంతో యాప్ ద్వారా హాజరు పడక కూలీలు చేసిన పనికి డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం పాత పద్ధతిలో మాస్టర్ ద్వారా హాజరు వేసే విధానాన్ని కొనసాగించాలని కోరారు. ఉపాధి హామీలు రెండు పూటలా హాజరు విధానాన్ని రద్దు చేయాలన్నారు. గతంలో మాదిరిగా సమ్మర్ అలవెన్స్ కూలీలకు కల్పించాలని కోరారు. పని ప్రదేశంలో ఉపాధి కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ నెల 10 నుండి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి యాత్రలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మార్చి 20 నుండి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీవో కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించి, మార్చి 30న కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తామన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకునేంతవరకు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు పోసన బోయిన హుస్సేన్, సోమ పంగు జానయ్య, గుంజ వెంకటేశ్వర్లు, షేక్ పఠాన్ మహబూబ్ అలీ, నారసాని వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు ఆరే రామకృష్ణారెడ్డి, దోసపాటి బిక్షం, అంజంపల్లి లక్ష్మయ్య, కల్లేపల్లి భాస్కర్, సిగ శ్రీను, కొల్లూరి బాబు, కొండమడుగుల వెంకటేశ్వర్లు, చెన్నబోయిన వీరయ్య, నాగయ్య, అంజయ్య, ధన మూర్తి తదితరులు పాల్గొన్నారు.

