బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల కొరత..? హోటళ్ల ఆందోళన – డిస్ట్రిబ్యూటర్ల కీలక ప్రకటన

హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల కొరత..? హోటళ్ల ఆందోళన – డిస్ట్రిబ్యూటర్ల కీలక ప్రకటన

నేటి తెలుగు పత్రిక,mar 10: హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న వార్తల మధ్య హోటల్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో హోటళ్ల నిర్వహణ కష్టంగా మారుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. ముఖ్యంగా రంజాన్ నెల నేపథ్యంలో హోటళ్లకు గ్యాస్ అవసరం పెరగడంతో సమస్య మరింత తీవ్రంగా మారిందని అంటున్నారు.ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో ప్రభావం పడిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని పలు నగరాలతో పాటు హైదరాబాద్‌లో కూడా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత కనిపిస్తోందని చెబుతున్నారు. హోటళ్లకు అవసరమైన గ్యాస్ సిలిండర్లు సరిపడా అందకపోవడంతో కొన్ని చోట్ల వ్యాపారం నిర్వహించడం కష్టంగా మారిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు కమర్షియల్ గ్యాస్ కొరత ఉండగా, మరోవైపు గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాపై కూడా వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. సిలిండర్ బుక్ చేసిన తర్వాత ఆలస్యంగా వస్తోందని కొందరు వినియోగదారులు చెబుతున్నారు.అయితే గ్యాస్ కొరతపై వస్తున్న వార్తలను డిస్ట్రిబ్యూటర్లు ఖండిస్తున్నారు. HP Gas డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని స్పష్టం చేశారు. వినియోగదారులు బుక్ చేసిన ఒక రోజులోనే సిలిండర్‌ను అందజేస్తున్నామని తెలిపారు. గ్యాస్ కొరతపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి