బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

రైతులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. క్యూఆర్ కోడ్‌తో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు

రైతులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. క్యూఆర్ కోడ్‌తో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు

నేటి తెలుగు పత్రిక,mar 10: ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు శుభవార్త తెలిపారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ రాజముద్రతో కూడిన ఈ పాసు పుస్తకాలను రాష్ట్రంలోని ప్రతి రైతుకు అందజేస్తామని తెలిపారు.సోమవారం కొత్తబురుజు లో పర్యటించిన సీఎం చంద్రబాబు రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హార్టికల్చర్ పంటల ఉత్పత్తుల స్టాళ్లను కూడా పరిశీలించారు. పండ్లకు కవర్లు తొడగడం వల్ల మంచి ధర వస్తోందని అధికారులు వివరించగా, రైతులకు దీనిపై మరింత అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు.

అనంతరం సభలో మాట్లాడిన చంద్రబాబు, కొత్త పాసు పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల భూ రికార్డుల్లో ఎలాంటి మార్పులు చేసినా వెంటనే గుర్తించవచ్చని చెప్పారు. రైతుల భూముల భద్రత కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో భూవివాదాలను పూర్తిగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం వెల్లడించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి భూమి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అలాగే గతంలో అమల్లో ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి రైతులకు ఉపశమనం కలిగించామని పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్