బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు బెయిల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు బెయిల్

నేటి తెలుగు పత్రిక,mar 10: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు Sభారత సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.మంగళవారం జస్టిస్ బి. వి. నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ప్రభాకర్ రావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు కీలక వివరాలు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సాక్ష్యాలను సేకరిస్తున్నామని, త్వరలోనే అదనపు చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై లోతైన విచారణ కొనసాగుతోందని కోర్టుకు వివరించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్టై జైల్లో ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదు అయింది. ప్రస్తుతం ప్రభాకర్ రావుకు లభించిన బెయిల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.