Breaking News

పాలలో కల్తీని గుర్తించండి. ఇలా..!..అనుసరించాల్సిన పద్ధతులపై ప్రజల్లో అవగాహన

  • కరపత్రాలు, సామాజిక మాధ్యమాలు, ఇతర మార్గాల ద్వారా చర్యలు

ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ నీలకంఠారెడ్డి

రాజమహేంద్రవరం ఘటన నేపథ్యంలో

అమరావతి,mar 10, నేటి తెలుగు పత్రిక: పాలు, పాల పదార్థాల్లో కల్తీని ఇంట్లోనే సులువుగా గుర్తించవచ్చునని రాష్ట్ర ఆహార భద్రత శాఖ ( ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్) వెల్లడించింది. ఏటవాలుగా పళ్లాన్ని ఉంచి పాల చుక్కను వదలినప్పుడు.. స్వచ్ఛమైన పాలు కనుక అయితే తెల్లటిధార మాదిరిగా దిగుతుంది. అదే నీరు కలిపిన పాలు అయితే తెల్లటి ధార లేకుండా త్వరగా కిందకి దిగిపోతుందని రాష్ట్ర ఆహార భద్రత శాఖ తెలిపింది. ఇలా చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా కల్తీ పాలు, వాటి ఉత్పత్తులకు దూరంగా ఉండవచ్చు అని పేర్కొంది. రాజమహేంద్రవరం ఘటన
నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తాజాగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదేశించిన ప్రకారం… కల్తీ పాలను ఎలా గుర్తించాలి అన్నదానిపై ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ) నీలకంఠారెడ్డి ఓ ప్రకటన జారీ చేశారు. ఫుడ్సేఫ్టీ అథారిటీ వారు పాలు, పాల ఉత్పత్తుల్లో జరిగే కల్తీని ఎలా కనుగొనాలో తెలియజేస్తూ పేర్కొన్న అంశాల( సూచనలు)ను కరపత్రాలు, పుస్తకాల రూపంలో ప్రచురించి విద్యా సంస్థలకు పంపిణీ చేయబోతున్నట్లు ఐపీఎం డైరెక్టర్ నీలకంఠారెడ్డి తెలిపారు. వీటి ద్వారా ముఖ్యకూడళ్లలోనూ ప్రచారాన్ని జరుపుతామన్నారు. అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.

యూరియా లేదా డిటర్జంటు కలిసిందో లేదో తెలుసుకోవాలంటే..!

*ఓ గ్లాసులో 10 ఎంఎల్ పాలు, 10 ఎంఎల్ నీటిని కలిపి, బాగా కదలించాలి. అప్పుడు పై భాగంలో మందమైన నురుగు ఏర్పడుతుంది. అదే స్వచ్ఛమైన పాలు అయినట్లయితే నురుగ రాదు. నురుగ వస్తే మాత్రం కల్తీ జరిగినట్లు గుర్తించాలి.

ముంబయిలో మంత్రి కందుల దుర్గేష్ పిలుపు.. ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి

రంగు మారితే..!

*మొక్కజొన్న లేదా ఇతర పిండి పదార్థాలను చిక్కదనం కోసం పాలలో కలిపారా లేదా తెలుసుకోవాలంటే ఓ గ్లాసులో పాలు తీసుకుని అయోడిన్ ద్రావణాన్ని రెండు, మూడు చుక్కలు కలిపినట్లయితే సదరు పాలు నీలం రంగులోనికి మారుతుంది. ఇదే జరిగితే కల్తీ జరిగినట్లు భావించాలి. రంగు మారకుండా ఉంటే వాటిని స్వచ్ఛమైన పాలుగా పరిగణించాలి.

*బంగాళాదుంప లేదా చిలకడ దుంప, ఇతర పిండి పదార్థాలను నెయ్యిలో కలిపారా? లేదా అని తెలుసుకోవడానికి ఒక స్పూన్ నెయ్యిని చిన్న గాజు గిన్నెలో వేయాలి. తర్వాత రెండు, మూడు చిన్న అయోడిన్ ఉప్పు ద్రావణాన్ని వేయాలి. అప్పుడు నెయ్యి నీలం రంగులోనికి మారితే కల్తీ జరిగినట్లు భావించాలి.

నెయ్యిలో వనస్పతి, పామాయిల్ ఉందా లేదో తెలుసుకోవాలంటే.

ఒక స్పూన్లో నెయ్యి తీసుకుని, కొంచెం చక్కెర కలిపి వేడిచేసినప్పుడు అది ఎరుపు లేదా పింక్ రంగులోనికి మారితే వనస్పతి కలిపినట్లు గుర్తించాలి. అలాగే గ్లాస్ వేడినీటిలో స్పూన్ నెయ్యిని వేస్తే.. ఒరిజనల్ నెయ్యి అయిన పక్షంలో అది పైన తేలుతుంది. వనస్పతి కలిపిన నెయ్యి అయితే చిన్నచిన్న ముద్దులుగా మారి కనిపిస్తుంది.*ఒక చుక్క నెయ్యిని అరచేతిలోనికి తీసుకుని గట్టిగా రుద్దినట్లయితే సువాసన రావాలి సువాసన రాకుండా ఉంటే నెయ్యిలో కల్తీ జరిగినట్లుగా భావించాలి.

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వేదిక షెడ్యూల్

కల్తీ గురించి తెలిస్తే ఫిర్యాదు చేయాలి!

కల్తీ ఘటనల గురించి తెలిస్తే 1800 425 3857 (టోల్-ఫ్రీ నెంబరు), 08645 297245 (ఐపీఎం ప్రధాన కార్యాలయం)కు తెలియజేయాలని డైరెక్టర్ నీలకంఠారెడ్డి సూచించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *