బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఎంపీ వద్దిరాజు దివంగత పొదిల విజయలక్ష్మీకి ఘన నివాళులు

ఎంపీ వద్దిరాజు దివంగత పొదిల విజయలక్ష్మీకి ఘన నివాళులు

ఖమ్మం, మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొదిల రవికుమార్ మాతృమూర్తి విజయలక్ష్మీ శుక్రవారం దివంగతులయ్యారు.బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, జిల్లా అధ్యక్షులు పారా నాగేశ్వరరావు,కాపు జేఏసీ ఛైర్మన్ చందు జనార్థన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తోట రామారావు తదితర ప్రముఖులు శనివారం ఉదయం వారి స్వగ్రామం ముదిగొండ మండలం ఖానాపురంలో ఆమె భౌతికకాయాన్ని సందర్శించి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు.స్వర్గీయ విజయలక్ష్మీ అంతిమయాత్రలో పార్థివదేహాన్ని ఉంచిన పాడేను రవిచంద్ర, గాంధీ, నాగేశ్వరరావు తదితర ప్రముఖులు మోసి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.దివంగత విజయలక్ష్మీ భర్త దేవేందర్, కుమారుడు రవికుమార్,కుమార్తె శైలజ, వారి కుటుంబ సభ్యులను రవిచంద్ర, గాంధీ, నాగేశ్వరరావు,జనార్థన్, రామారావు, పోలీస్ అధికారులు రామోజీ రమేష్,సాధుల సారంగపాణి, ఎక్సైజ్ శాఖ అధికారి శ్యామ్, బీఆర్ఎస్ నాయకుడు బచ్చు విజయ్ కుమార్ తదితరులు పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి