బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ వార్తలు ఫేక్.. వైరల్ వీడియోలపై జీవిత రాజశేఖర్ క్లారిటీ

రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ వార్తలు ఫేక్.. వైరల్ వీడియోలపై జీవిత రాజశేఖర్ క్లారిటీ

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఇటీవల సోషల్ మీడియాలో హీరో రాజశేఖర్ కు గోటీల (గోళీలు) ఫ్యాక్టరీ ఉందని, అక్కడ ఉద్యోగాలు కూడా ఇస్తున్నారంటూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రచారంపై ఆయన భార్య, నటి జీవిత రాజశేఖర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారుకొన్ని రోజులుగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ అంటూ ఫోటోలు, వీడియోలు విస్తృతంగా షేర్ అవుతున్నాయి. సినిమా అవకాశాలు తగ్గడంతో రాజశేఖర్ ఫ్యాక్టరీ ప్రారంభించారని, అక్కడ ఉద్యోగాలకు లక్షల్లో జీతాలు ఇస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.అయితే తాజాగా ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న జీవిత రాజశేఖర్ ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. రాజశేఖర్ పేరుతో ఎలాంటి గోటీల ఫ్యాక్టరీ లేదని, సోషల్ మీడియాలో జరుగుతున్నది పూర్తిగా ఫేక్ ప్రచారమేనని స్పష్టం చేశారు.

“అసలు ఆ గోటీల ఫ్యాక్టరీలేమిటో మాకు కూడా అర్థం కావడం లేదు. నేను, మా ఆయన, మా పిల్లలు ఆ పోస్టులు చూసి నవ్వుకుంటున్నాం. ఈ మధ్య సోషల్ మీడియాలో నిజం-అబద్ధం తేడా తెలియకుండా చాలా ఫేక్ వార్తలు వస్తున్నాయి” అని ఆమె అన్నారు.ఇంకా కొందరు ఈ ఫేక్ ప్రచారాన్ని ఉపయోగించి నిరుద్యోగులను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని విన్నామని, అలాంటి పోస్టులను నమ్మకూడదని ప్రజలకు ఆమె సూచించారు. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మాత్రమే నమ్మాలని కోరారు.దీంతో హీరో రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ వార్తలు పూర్తిగా కల్పితమని జీవిత రాజశేఖర్ స్పష్టత ఇచ్చారు.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?