బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఎన్.చంద్రబాబు నాయుడు ప్రశంసలు.. ప్రకృతి సేద్యంతో రైతు రోశయ్య విజయగాథ స్ఫూర్తిదాయకం

ఎన్.చంద్రబాబు నాయుడు ప్రశంసలు.. ప్రకృతి సేద్యంతో రైతు రోశయ్య విజయగాథ స్ఫూర్తిదాయకం

అమరావతి ,మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న గుంటూరు జిల్లా రైతు రోశయ్యను ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదిక X లో పోస్టు చేస్తూ ఆయన రైతు కృషిని ప్రశంసించారు.

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన రైతు రోశయ్య, 80 ఏళ్ల వయసులో కూడా కేవలం 75 సెంట్ల భూమిలో 52 రకాల పంటలు పండిస్తూ నెలకు రూ.20 వేలకుపైగా ఆదాయం పొందుతున్నారని సీఎం పేర్కొన్నారు. ప్రకృతిని తల్లిలా భావిస్తూ సాగు చేస్తున్న ఆయన విజయగాథ స్ఫూర్తిదాయకమని అన్నారు.2016లో రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రేరణ పొంది రోశయ్య సహజ సాగు ప్రారంభించారని తెలిపారు. కృషి, పట్టుదలతో ఆయన సాధిస్తున్న విజయాలు ఇతర రైతులకు ఆదర్శమని సీఎం అన్నారు.రైతు రోశయ్యకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, ప్రకృతి వ్యవసాయం ద్వారా మరింత మంది రైతులు ముందుకు రావాలని ఎన్.చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్