Breaking News

యష్ పై వేణు స్వామి కామెంట్స్ వివాదం.. అభిమానుల ఆగ్రహం

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): కన్నడ స్టార్ హీరో యష్ గురించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలపై యశ్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తూ వేణు స్వామి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఏమన్నారు వేణు స్వామి?

కొన్ని నెలల క్రితం ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడుతూ,యష్ ప్రస్తుతం కష్టమైన పరిస్థితిలో ఉన్నారని, భారీ విజయాలు సాధించిన K.G.F: Chapter 1 మరియు K.G.F: Chapter 2 తర్వాత అదే స్థాయి విజయాన్ని కొనసాగించడం కోసం ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. దీంతో యశ్ డిప్రెషన్‌లో ఉన్నారని కూడా ఆయన పేర్కొన్నారు.

వైరల్ అవుతున్న పాత వీడియో

ఈ ఇంటర్వ్యూ రెండు నెలల క్రితం జరిగినప్పటికీ, తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన యశ్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తూ తమ హీరోపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని మండిపడుతున్నారు.

అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ వరల్డ్ రికార్డ్.. చెస్‌లో అరుదైన ఘనత

వివాదాల్లో వేణు స్వామి

ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం వేణు స్వామి కు కొత్తేమీ కాదు. గతంలో కూడా పలువురు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు.

‘టాక్సిక్’ సినిమాతో యశ్

ఇక యష్ ప్రస్తుతం Toxic సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో నయనతార, కియారా అద్వానీ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం.అదే సమయంలో యశ్ మరో భారీ ప్రాజెక్ట్ అయిన రామాయణం లో రావణుడి పాత్రలో కనిపించనున్నారు.

రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ వార్తలు ఫేక్.. వైరల్ వీడియోలపై జీవిత రాజశేఖర్ క్లారిటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *