Breaking News

*BM SkillsBuild – CSRBOX తో కోదాడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ ( కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల )ఒప్పందం.

కోదాడ ,మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక ): ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ IBM SkillsBuild – CSRBOX తో కలిసి విద్యార్థినుల ఉన్నతి కోసం కొత్త అవకాశాలకు, కొదాడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ ( కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల) శ్రీకారం చుట్టింది.ప్రముఖ అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థ IBM SkillsBuild – CSRBOX తో తమ కళాశాల విద్యార్థినులకు నూతన సాంకేతిక కోర్సులను అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ తెలిపారు.ఈ ఒప్పందం ద్వారా టెక్నాలజీ రంగంలో ఆధునిక కోర్సులను నేర్చుకునే అవకాశం విద్యార్థినులకు లభిస్తుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలతో కలిసి పని చేసే అవకాశం రావడం తమ కళాశాలకు గర్వకారణమని, అలాగే ఈ ఒప్పందం ద్వారా ప్రాంతీయ యువతికి కొత్త అవకాశాలు లభిస్తాయని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో IBM SkillsBuild – CSRBOX ప్రతినిధి సాయి ప్రసాద్, కళాశాల డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు, కళాశాల ట్రైనింగ్ ప్లేసెమెంట్ అధికారిణి పుష్పలత అధ్యాపకులు పాల్గొన్నారు.

మే 10న తెలంగాణకు ప్రధాని మోదీ.. ₹7,823 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

పిల్లల దత్తతలో జాగ్రత్తలు తప్పనిసరి.. ఐసీడీఎస్‌ను సంప్రదించండి: మంత్రి సీతక్క

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *