బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 2,064 ఇళ్ల పంపిణీ.. సొంతింటి కల నిజం కానుంది

చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 2,064 ఇళ్ల పంపిణీ.. సొంతింటి కల నిజం కానుంది

అమరావతి,మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తిరుపతి జిల్లాలో నిర్మించిన 2,064 టిడ్కో ఇళ్లను ఈ నెల 17న ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ప్రారంభించి లబ్ధిదారులకు అందించనున్నారు.

నాయుడుపేట సమీపంలో భారీ ప్రాజెక్ట్

తిరుపతి జిల్లాలోని నాయుడుపేట సమీపంలోని బిరదవాడ వద్ద ఈ ఇళ్లను నిర్మించారు. జాతీయ రహదారి 16 పక్కన 36 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.168 కోట్ల వ్యయంతో మొత్తం 2,064 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అన్ని మౌలిక సదుపాయాలతో ఇళ్లను సిద్ధం చేశారు.

ఉగాది కానుకగా ఇళ్ల పంపిణీ

తెలుగు నూతన సంవత్సరం అయిన ఉగాది సందర్భంగా పేదల సొంతింటి కలను నిజం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఉగాదికి ముందుగానే ఈ నెల 17న ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

మధ్యలో ఆగిన పనులు.. మళ్లీ పూర్తి

గతంలో ప్రభుత్వం ప్రారంభించిన ఈ టిడ్కో ఇళ్ల నిర్మాణం దాదాపు 70 శాతం పూర్తయ్యాక ఎన్నికల కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది. తాజాగా తిరిగి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పెండింగ్ పనులను పూర్తి చేసి ఇళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.దీంతో సంవత్సరాలుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాల కల నెరవేరబోతోంది.