బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మన కృషి అగ్రిడ్రోన్ సెంటర్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

మన కృషి అగ్రిడ్రోన్ సెంటర్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట : మార్చి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో పాత గుట్ట రోడ్డు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మన కృషి అగ్రి డ్రోన్ సెంటర్” ను ప్రభుత్వ విప్ ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య రిబ్బన్ కట్ చేసి అగ్రి డ్రోన్ సేవలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికతను వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టడం ద్వారా రైతులకు ఎంతో ఉపయోగం చేకూరుతుందని తెలిపారు. అగ్రి డ్రోన్‌ల ద్వారా పంటలపై మందులు పిచికారీ చేయడం, ఎరువులు వేయడం, పంటల పరిస్థితిని పరిశీలించడం వంటి పనులు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో చేయగలమని అన్నారు. దీని వల్ల రైతుల శ్రమ తగ్గడంతో పాటు దిగుబడులు పెరగడానికి కూడా సహాయపడుతుందని పేర్కొన్నారు.వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడానికి యువత ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. రైతులకు కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం గ్రామీణ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. అనంతరం అగ్రి డ్రోన్ సెంటర్ నిర్వాహకులు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారిని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి