బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

టెన్షన్ వద్దు.. భారత్‌కు LPG నౌకలు రానున్నాయి: కేంద్రం క్లారిటీ

టెన్షన్ వద్దు.. భారత్‌కు LPG నౌకలు రానున్నాయి: కేంద్రం క్లారిటీ

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ కొరతపై వస్తున్న వార్తలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ దేశంలో ఎల్‌పీజీ కొరత ఏమీ లేదని, ప్రజలు ఆందోళనతో ముందస్తు బుకింగ్స్ చేయడం వల్లే తాత్కాలిక సమస్య ఏర్పడిందని తెలిపారు. Iran – Israel మధ్య ఉద్రిక్తతల కారణంగా పశ్చిమాసియా పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో భారత్‌లో గ్యాస్ సరఫరాపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఎల్‌పీజీ దొరకదేమోనని భావించి పెద్ద ఎత్తున ముందస్తు బుకింగ్స్ చేయడంతో ఒక్కసారిగా దాదాపు 88 లక్షల బుకింగ్స్ నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.ఈ నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా మళ్లీ ప్రారంభించినట్లు Sujata Sharma తెలిపారు. అవసరం ఉన్నప్పుడే బుకింగ్స్ చేయాలని ప్రజలకు సూచించారు. భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎల్‌పీజీ కొనుగోలుదారుగా ఉందని, దేశానికి వచ్చే ఎల్‌పీజీలో సుమారు 90 శాతం Strait of Hormuz మార్గం ద్వారానే వస్తుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్‌కు వచ్చే నౌకలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని Iran ఇప్పటికే భరోసా ఇచ్చిందని సమాచారం. త్వరలో హర్మూజ్ మార్గం ద్వారా రెండు LPG నౌకలు భారత్‌కు చేరనున్నాయని ఆమె వెల్లడించారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

అదేవిధంగా దేశంలో పెట్రోల్, డీజిల్, ముడిచమురు నిల్వలు కూడా తగినంతగా ఉన్నాయని, ఇంధన సరఫరాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.