బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

పైప్‌లైన్ గ్యాస్ వాడేవారికి కేంద్రం షాక్.. LPG సిలిండర్లు సరెండర్ చేయాలి

పైప్‌లైన్ గ్యాస్ వాడేవారికి కేంద్రం షాక్.. LPG సిలిండర్లు సరెండర్ చేయాలి

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగదారులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పైప్‌లైన్ గ్యాస్ ఉపయోగిస్తున్న వారు ఎల్‌పీజీ సిలిండర్ కనెక్షన్లు కొనసాగించరాదని స్పష్టం చేసింది.పైప్డ్ నేచురల్ గ్యాస్ వాడుతున్న వినియోగదారులకు కొత్తగా ఎల్‌పీజీ కనెక్షన్లు ఇవ్వవద్దని గ్యాస్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కనెక్షన్లు ఉన్నవారు తమ సిలిండర్లను సరెండర్ చేయాలని సూచించింది. పైప్‌లైన్ గ్యాస్ అందుబాటులో ఉండగా మళ్లీ ఎల్‌పీజీ సిలిండర్లు వినియోగించడం సరైంది కాదని కేంద్రం పేర్కొంది.ఒకవేళ PNG వాడుతున్న వినియోగదారుల వద్ద LPG సిలిండర్లు ఉంటే వాటిని తిరిగి తీసుకోవాలని కూడా ఏజెన్సీలకు సూచించింది. గ్యాస్ కొరత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇటీవల ఎల్‌పీజీ సరఫరాపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. గ్యాస్ బుకింగ్ చేసిన అందరికీ సకాలంలో సరఫరా జరుగుతుందని అధికారులు తెలిపారు. అవసరం లేకపోయినా ముందస్తు బుకింగ్స్ చేయవద్దని వినియోగదారులను కోరారు.సుజాత శర్మ, పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (మార్కెటింగ్, ఆయిల్ రిఫైనరీ) మాట్లాడుతూ ఇళ్లకు, ఆస్పత్రులకు, హాస్టళ్లకు గ్యాస్ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. వాణిజ్య సిలిండర్ల సరఫరాపై రాష్ట్రాలతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.అదేవిధంగా గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అక్రమంగా నిల్వ చేసిన సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ